AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Dates: రాత్రి పడుకునే ముందు రెండు ఎండు ఖర్జూరాలు నానబెట్టి.. ఉదయాన్నే తిన్నారనుకోండి.. ఇక.!

శీతాకాలంలో ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఫైబర్, ఐరన్ లాంటి ముఖ్య పోషకాలతో నిండి ఉంటుంది. కీళ్ల నొప్పులు, అలసట, జలుబు లాంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Dry Dates: రాత్రి పడుకునే ముందు రెండు ఎండు ఖర్జూరాలు నానబెట్టి.. ఉదయాన్నే తిన్నారనుకోండి.. ఇక.!
Dry Dates
Ravi Kiran
|

Updated on: Jan 07, 2026 | 11:53 AM

Share

శీతాకాలంలో ఎండు ఖర్జూరం తినొచ్చా.? లేదా.? ఇది అందరిలోనూ ఉండే ప్రశ్న. ఈ వింటర్ సీజన్‌లో ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎండు ఖర్జూరం ఎముకలను బలంగా మార్చడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి మరింత శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తాయి. అలాంటి వాటిలో ఎండు ఖర్జూరం ఒకటి. ఎండు ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి లాంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఎముకల నొప్పులు, జీర్ణ సమస్యలు, అలసట లాంటి సమస్యలకు ఎండు ఖర్జూరం మంచి ఔషధంలా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎండు ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. రాత్రి ఒక గ్లాసు నీటిలో రెండు ఎండు ఖర్జూరాలు, ఒక చెంచా మెంతులు నానబెట్టి ఉంచి.. ఉదయం లేచిన వెంటనే ఖర్జూరాలను నమిలి తిని, ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే శరీరంలోని నొప్పులన్నీ క్రమంగా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఎప్పుడూ అలసటగా ఉండటం, శరీరంలో శక్తి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే ఎండు ఖర్జూరం మంచి పరిష్కారం. రాత్రి పూట లేదా ఉదయం ఎండు ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. అలాగే ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగకరం. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి, రక్తహీనత లక్షణాలైన అలసటను తగ్గిస్తుంది. చలికాలంలో ఛాతిలో కఫం చేరడం, దగ్గు, జలుబు లాంటి శ్వాస సంబంధిత సమస్యలు సర్వసాధారణం. రెండు ఎండు ఖర్జూరాలను బాగా నమిలి తిని, తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగితే కఫం కరిగి బయటకు రావడంలో సహాయపడుతుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

ఎండు ఖర్జూరంలో ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. క్రమం తప్పకుండా ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా పనిచేస్తాయి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎండు ఖర్జూరం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె పనితీరును బలోపేతం చేస్తుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి శరీరం రక్షణ పొందుతుంది. చలికాలంలో ఎండు ఖర్జూరం తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. రోజు పరిమిత మోతాదులో తీసుకుంటే శక్తి, ఆరోగ్యం రెండు మెరుగవుతాయి. అయితే, మధుమేహం ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది.

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా
రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా
రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలు పెంపు..
రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలు పెంపు..
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు
టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట
టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట
భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కిషన్ రెడ్డి
భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కిషన్ రెడ్డి
తిరుమలకు ప్లాన్‌ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమలకు ప్లాన్‌ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరిలో మరో రోజు బ్యాంకులు బంద్
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరిలో మరో రోజు బ్యాంకులు బంద్
ఐపీఎల్‌ వేలంలో ఛీ కొట్టారు.. కార్డు సెంచరీతో దిమ్మతిరిగే షాక్
ఐపీఎల్‌ వేలంలో ఛీ కొట్టారు.. కార్డు సెంచరీతో దిమ్మతిరిగే షాక్
రోడ్డుపై వెళ్తుండగా దూరాన కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని..
రోడ్డుపై వెళ్తుండగా దూరాన కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని..
రో-కోలపై ఆసక్తికర వ్యాఖ్యలు.. హీట్ పెంచిన కివీస్ కెప్టెన్
రో-కోలపై ఆసక్తికర వ్యాఖ్యలు.. హీట్ పెంచిన కివీస్ కెప్టెన్