బీరు తాగితే కిడ్నీలో రాళ్ళు మంచులా కరిగిపోతాయా..? అసలు నిజం తెలిస్తే..
Beer and Kidney Stones Myth : ఇటీవలి కాలంలో కిడ్నీలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. కడుపు నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలా మంది వివిధ సూచనలను అనుసరిస్తారు. ముఖ్యంగా, బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనే అపోహను నమ్ముతారు.. కానీ అది తప్పు..

ఇటీవలి కాలంలో కిడ్నీలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కడుపు నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలా మంది వివిధ సూచనలను అనుసరిస్తారు. ముఖ్యంగా, పలు మూఢ నమ్మకాలను అనుసరించడం అలాగే.. బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.. అనే అపోహలను నమ్ముతారు. వాస్తవానికి ఎంత వరకు నిజం.. బీరు తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయా? ఇది నిజమేనా అనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
వాస్తవానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయనేది ఎంతవరకు నిజమో పక్కన పెడితే.. వైద్య శాస్త్రం ప్రకారం, కిడ్నీలో రాళ్ళు కరిగిపోయే బదులు, బీరు తాగడం వల్ల కిడ్నీలు మరింత దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీరు తాగడం వల్ల కొన్ని కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీరు మూత్ర విసర్జన చేస్తుంది. అంటే మీరు దీన్ని తాగినప్పుడు, మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. దీనివల్ల శరీరం నుండి నీరు వేగంగా వెళ్లిపోతుంది.. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నిజానికి, కిడ్నీలో రాళ్లను వదిలించుకోవడానికి శరీరానికి పెద్ద మొత్తంలో నీరు అవసరం. కానీ బీరు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.. రాళ్లను గట్టిపరుస్తుంది. బీరు తాగినప్పుడు.. సాధారణం కంటే.. కిడ్నీలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.
వాస్తవానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. బీరులో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణమైన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. బీరును నిరంతరం తాగడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.. కొత్త రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మూత్రపిండాల్లో రాయి 5 మి.మీ కంటే పెద్దదిగా ఉంటే, అది నీటితోనూ దానంతట అదే బయటకు రాదు. బీరు తాగడం వల్ల మూత్ర పీడనం పెరిగితే, రాయి మూత్రనాళంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ఇది భరించలేని నొప్పిని కలిగించడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది. అధిక మూత్రవిసర్జన కారణంగా రాళ్ళు పోయినట్లు తాత్కాలికంగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో, బీరు కాలేయం, మూత్రపిండాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు, స్వీయ వైద్యం చేసుకునే బదులు వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందడం మంచిది. కిడ్నీలో రాళ్లను నివారించడానికి, రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగడం.. నిమ్మరసం తీసుకోవడం వంటి సహజ పద్ధతులను అనుసరించడం ఉత్తమం. మీకు కిడ్నీ సమస్యలు ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
