AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: మటన్‌లోని ఈ పార్ట్స్‌కు యమ డిమాండ్.. తిన్నారంటే ఆ రోగాలన్నీ పరారే

పాయా ఎముకల బలానికి, కీళ్ల నొప్పుల నివారణకు చాలా ఆరోగ్యకరమైనది. పాయాలో కొల్లాజెన్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. మేక కాళ్లను పసుపు, ఉప్పుతో శుభ్రం చేసి, సుగంధ ద్రవ్యాలతో ఉడికించి తయారుచేసే ఈ సూప్ పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ప్రయోజనకరం. వారానికి రెండుసార్లు తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి.

Mutton: మటన్‌లోని ఈ పార్ట్స్‌కు యమ డిమాండ్.. తిన్నారంటే ఆ రోగాలన్నీ పరారే
Mutton Paya Soup Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jan 07, 2026 | 4:10 PM

Share

పాయా యమ స్పెషల్.. నాన్ వెజ్ తినేవారు, ముఖ్యంగా మటన్ ప్రియులు గుటుక్కున మింగేస్తారు.. మటన్ లో ఏ పార్టయినా.. ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.. ముఖ్యంగా మేక లేదా గొర్రె కాళ్ల సూప్.. పలు సమస్యలకు పవర్‌ఫుల్ గా పనిచేస్తుందని పేర్కొంటున్నారు డైటిషీయన్లు.. మేక కాళ్ళ సూప్ లేదా పాయ సూప్.. ఎముకల బలానికి, శారీరక నొప్పుల ఉపశమనానికి ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన వంటకం. దెబ్బలు తగిలి రక్తం కోల్పోయినప్పుడు లేదా కాళ్లు చేతులు లాగుతున్నప్పుడు ఈ సూప్‌ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ముల్గ (ఎముకల మజ్జ) వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు. వారానికి రెండుసార్లు ఈ సూప్‌ను 10-15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని.. ఎన్నో సమస్యలను దూరం చేస్తుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని తరచూ రిఫర్ చేస్తుంటారు..

పాయా పోషకాలు..

పాయాలో కొల్లాజెన్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంతోపాటు విటమిన్లతో సమృద్ధిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

పాయా తినడం వల్ల కలిగే లాభాలు

పాయా (ఎముకల రసం) కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి మంచిది.

అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ఇంకా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి పాయా అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు.. బలోపేతం అవుతుంది..

ఇంకా బలహీనత నుండి త్వరగా కోలుకోవడానికి పాయా సహాయపడుతుంది.

ఈ సూప్ తయారీకి, ముందుగా మేక కాళ్లను పసుపు, ఉప్పుతో శుభ్రం చేసి కడగాలి. ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దంచిన వెల్లుల్లి, అల్లం ముక్క, ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత మేక కాళ్లను సిమ్ లో ఐదు నిమిషాలు వేయించాలి. తగినంత ఉప్పు, నీరు (1 లీటర్ పైగా) పోసి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా బాదం పొడి (లేదా జొన్న పిండి), దంచిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన పాయ సూప్ సిద్ధం అవుతుంది. అయితే.. దాని పరిమాణాన్ని బట్టి పదార్థాలను జోడించుకోవాలి..

మటన్ వంట లాగానే దీనిని చేసుకోవచ్చు.. కానీ, వండే విధానం వేరు.. ఈ సూప్ పెద్దలతో పాటు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన సూప్‌ను మీ ఇంట్లో ప్రయత్నించి, దాని ప్రయోజనాలను పొందండి. ఏమైనా సమస్యలుంటే తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..