బఠానీలే కాదండోయ్..   తొక్కల వలన కూడా బోలేడు లాభాలు !

Samatha

7 January 2026

 చాలా మంది బఠానీలను చాలా ఇష్టంగా తింటారు. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బఠానీ తొక్కలు

అయితే బఠానీలు మాత్రమే కాదండోయ్, బఠానీ తొక్కల వలన కూడా బోలేడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

బఠానీ తొక్కలతో ఆరోగ్యం

బఠానీ తొక్కల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం,కాల్షియం, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్స్

గుండె ఆరోగ్యం కోసం బఠానీలను తినడం వలన అనేక ప్రయోజనాలు  ఉన్నాయంట. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె సమస్యలు తగ్గిపోతాయి.

గుండె ఆరోగ్యం

అదే విధంగా రోగనిరోధక శక్తి   పెరగాలి అంటే కూడా బంఠానీ తొక్కలను మీ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

రోగనిరోధక శక్తి

బఠానీ తొక్కలు కంటి ఆరోగ్యానికి కూడా చాలా  మేలు చేస్తాయి. ఇందులో విటమిన్  ఎ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన మీ కంటి చూపు మెరుగు పడుతుంది.

కంటి ఆరోగ్యం

రక్త హీనత సమస్యతో బాధపడే వారు కూడా తమ  ఆహారంలో బఠానీ తొక్కలను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.

రక్తహీనత

అయితే బఠానీ తొక్కలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించాలి మంచిదని అతిగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యల బారినపడే  ఛాన్స్ ఉంటుందంట.

జాగ్రత్త అవసరం