Telangana: తెలంగాణ ఆరోగ్య వార్షిక నివేదిక విడుదల.. నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో 3వ స్థానం..
తెలంగాణ ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు 5 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఆరోగ్య శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు 5 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఘటన తరువాత ప్రత్యేక శిక్షణ ఇచ్చామని.. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజాన్ని కూడా మెరుగుపరిచినట్లు స్పష్టం చేశారు హరీష్‌రావు. నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని చెప్పారు మంత్రి హరీష్‌రావు. ఇక డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకునే యూపీ మాత్రం చివరి స్థానంలో నిలిచిందని విమర్శించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ పలమనాలజీ సదస్సు..
యశోద హాస్పిటల్స్ అంతర్జాతీయ పలమనాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. అంతర్జాతీయ స్థాయిలో మూడోసారి హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు హాజరయ్యారు. యశోద అసుపత్రి నిర్వహించిన ఈ సదస్సుకు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. దేశం నుంచి కాకుండా 40దేశాలు నుంచి సదస్సుకు రావడం గర్వనీయమన్నారు. ఇంత గొప్ప కాన్ఫరెన్స్ నిర్వహించిన యశోద ఆసుపత్రికి అభినందనలు తెలియజేశారు. కరోనా తరవాత పల్మనాలాజీ , లంగ్ కేర్‌పైన సామాన్య ప్రజలకు అవగాహనా బాగా పెరిగిందన్నారు. వైద్యరంగంలో ఎన్నో మార్పులు, టెక్నాలజీ వస్తున్నాయని, ఇలాంటి సదస్సులతో కొత్త ట్రీట్మెంట్ ,కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం ఉందన్నారు హరీష్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..