Divyansha kaushik: నాగచైతన్యతో పెళ్లి వార్తలపై స్పందించిన దివ్యాన్ష కౌశిక్.. ఏమందంటే.
సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటుంటారు. మరీ ముఖ్యంగా నటీమణులు వ్యక్తిగత విషయాల్లో గాసిప్స్‌కు కొదవే ఉండదు. ఎప్పుడు, ఎలాంటి వార్తల పుట్టుకొస్తుందో తెలియదు. చివరికి..
సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటుంటారు. మరీ ముఖ్యంగా నటీమణులు వ్యక్తిగత విషయాల్లో గాసిప్స్‌కు కొదవే ఉండదు. ఎప్పుడు, ఎలాంటి వార్తల పుట్టుకొస్తుందో తెలియదు. చివరికి సెలబ్రిటీలు నేరుగా స్పందించి పుకార్లు చెక్ పెట్టే వరకు వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ పుకారే నెట్టింట తెగ సందడి చేసింది. మజిలీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార దివ్యాన్ష కౌశిక్, హీరో నాగ చైతన్యతో రిలేషన్‌లో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు తెగ సందడి చేశాయి. ఈ వార్త చివరికి దివ్యాన్ష చెవిలో కూడా పడడంతో ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది.
ప్రస్తుతం మైఖేల్ చిత్రంలో నటిస్తోన్న దివ్యాన్ష తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాగచైతన్య చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీలో నాకు ఛాన్స్ రావడానికి చై కారణమంటూ వచ్చిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. చైతన్యను సీనియర్‌గా భావిస్తాను. వృత్తిపరంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ మధ్యకాలంలో మేమిద్దరం మాట్లాడుకున్నది కూడా లేదు’ అని క్లారిటీ ఇచ్చేసింది.
ఇక విజయ్ దేవరకొండ తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పుకొచ్చిన దివ్యాన్ష.. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత విజయ్‌పై క్రష్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ ఆయన్నే ఇష్టపడుతున్నారు. దాంతో నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు తన క్రష్ ఆదిత్య రాయ్ కపూర్ అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న మైఖేల్‌తో పాటు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ఒక సినిమా, తమిళ్‌లో మరో సినిమాలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..