Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Kashyap: సుశాంత్ విషయంలో అలా ప్రవర్తించినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కామెంట్స్..

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తన ప్రవర్తనకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నట్లు తెలిపారు. చనిపోవడానికి మూడు వారాల ముందు సూశాంత్ తనతో మాట్లాడేందుకు ట్రై చేశాడని.. అలాగే తనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడానికి..

Anurag Kashyap: సుశాంత్ విషయంలో అలా ప్రవర్తించినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కామెంట్స్..
Anurag Kashyap, Sushant
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 29, 2023 | 2:52 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశాన్ని కుదిపేసింది. 2020 జూన్ లో ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం కాగా.. ఆ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ పోస్ట్ మార్టం చేసిన వైద్యుల బృందంలోని ఒకరు సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తన ప్రవర్తనకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నట్లు తెలిపారు. చనిపోవడానికి మూడు వారాల ముందు సూశాంత్ తనతో మాట్లాడేందుకు ట్రై చేశాడని.. అలాగే తనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడానికి.. కానీ అతడితో మాట్లాడేందుకు తాను ఇష్టపడలేదని.. అందుకు తన సొంత కారణాలున్నాయని.. కానీ మూడు వారాల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న వార్త విన్నానని.. ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్‏తో ఏర్పడిన వివాదాల గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనురాగ్.. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లతో నెలకొన్న విభేదాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. “చాలా విషయాలు తెలుసుకోవడానికి నాకు ఏడాదిన్నర సమయం పట్టింది. గత సంవత్సర కాలంగా నేను అనారోగ్యంతో బాధపడ్డాను. ఆసమయంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ప్రతిసారి అందరిపై అరిచేవాడిని అని గ్రహించేందుకు ఇన్నాళ్లు పట్టింది. ప్రస్తుతం కాలం మారింది. ఇక్కడ నా మాటే కాదు.. ఎవరూ ఎవరి మాట వినరు. సోషల్ మీడియా అయిపోయింది అంతా. ఇప్పుడు నేను కూడా వెనక్కు తగ్గాను. కొన్ని విషయాలు ఇప్పటికీ నన్ను బాధపెడుతున్నాయి. ఇప్పుడు అన్నింటి గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మారిపోయింది. ఇప్పుడు నేను ప్రతిదీ వెనక్కు తీసుకురాలేను. నాకు అభయ్ కు జరిగిన గొడవ గురించి కూడా చెబుతాను.

13 ఏళ్ల క్రితం ఒక నటుడితో నాకు ఎదురైన అనుభవాల గురించి చెబుతాను. అలాగే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో నా ప్రవర్తన గురించి ఇప్పటికీ బాధపడతున్నాను. అతను చనిపోవడానికి మూడు వారాల ముందు నాతో మాట్లాడేందుకు.. నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ నేను అతడితో మాట్లాడేందుకు అంగీకరించలేదు. అందుకు కారణం అతను గతంలో నా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నేను మరో నటుడిని ఎంపిక చేసుకున్నాను. అందుకే మళ్లీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత మూడు వారాలకు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న వార్త విన్నాను. సుశాంత్ విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.