Aadhaar Card: జస్ట్ 60 సెకన్లలో వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు
Aadhaar Download: ఆధార్ కార్డు మీ పాకెట్‌లో లేదు. వెంటనే అవసరం పడింది.. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు.. ఇంటికెళ్లి ఆధార్ తెచ్చుకుంటారు. కానీ ఆ అవసరం లేదు. కేవలం నిమిషాల్లోనే వాట్సప్ ద్వారా ఆధార్ సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ట్ ఫాలో అవ్వండి

Whats APP Aadhaar: ఆధార్ కార్డు అనేది ఓ నిత్యావసర డాక్యుమెంట్‌గా మారింది. దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అవసరమే. ఎప్పుడు దీని అవసరం పడుతుందో తెలియదు. అందుకే అందరూ తమ వ్యాలెట్ లేదా జేబుల్లో ఆధార్‌ను తప్పనిసరిగా ఉంచుకుంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వెంటనే చూపిస్తే పని త్వరగా పూర్తవుతుంది. ఆధార్ కార్డును సులభతరంగా ప్రజలు వినియోగించుకునేందుకు యూఐడీఏఐ అనేక కొత్త పద్దతులు ప్రవేశపెడుతోంది. ఆధార్‌ను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. అవసరమైనప్పుడు మీరు నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ వెబ్‌పైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే కాకుండా వాట్సప్ ద్వారా కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ ఎలా..?
-మీ ఫోన్‌లో 9013151515 నెంబర్‌ను సేవ్ చేసుకోండి -వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి -అక్కడ సర్వీసులు అన్నీ డిస్ ప్లే అవుతాయి -డిజిలాకర్ ఆప్షన్‌ను ఎంచుకుని సబ్మిట్ చేయండి -డిజిలాకర్ డీటైల్స్ ఇచ్చి వెరిఫై చేసుకోండి -మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి -రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించండి -డిజిలాకర్‌లో భద్రపర్చుకున్న డాక్యుమెంట్స్ వివరాలు అన్నీ కనిపిస్తాయి -ఆధార్‌ను ఎంచుకుని సబ్మిట్ చేయండి -ఆధార్ మీకు వాట్సప్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుతుంది
డిజిలాకర్‌కు ఆధార్ లింక్ చేస్తేనే..
అయితే మీరు వాట్సప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అంతకముందు డిజిలాకర్‌లో ఆధార్‌ను లింక్ చేసి ఉండాలి. అలా చేసి ఉంటేనే మీరు ఆధార్ వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. లింక్ చేసుకోకపోతే వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోలేరు. అందుకే ముందుగా డిజిలాకర్‌లో లాగిన అయి ఆధార్‌ను లింక్ చేయండి. దీని వల్ల మీకు అత్యవసరమైన సమయాల్లో సెకన్ల వ్యవధిలోనే ఆధార్‌ను వాట్సప్ ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మీరు ఆధార్‌ను అక్కడ లింక్ చేసి భద్రపర్చుకోవచ్చు. గతంలో డిజిలాకర్ లేదా ఎంఆధార్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వాట్సప్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది.
