Gold Coins: అక్కడ కుప్పులు తెప్పలుగా బంగారు నాణేలు.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత.. ఎక్కడంటే..
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. మొన్న కర్నాటకలో జరిగింది, ఇవాళ మధ్యప్రదేశ్‌లో రిపీటయింది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ దగ్గర ఓ కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇప్పుడు బంగారు నాణేలు దొరుకుతున్నాయట. దీంతో జనం ఎగబడి మరీ తవ్వకాలు జరుపుతున్నారు.

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. మొన్న కర్నాటకలో జరిగింది, ఇవాళ మధ్యప్రదేశ్‌లో రిపీటయింది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ దగ్గర ఓ కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇప్పుడు బంగారు నాణేలు దొరుకుతున్నాయట. దీంతో జనం ఎగబడి మరీ తవ్వకాలు జరుపుతున్నారు. చిన్నాపెద్దా ముసలిముతకా ఆడామగా.. ఇప్పుడు అందరికి అదే పని. బంగారు నాణేల వేటలో ఊరు ఊరంతా నిమగ్నమైంది. ఫలానా వాళ్లకు అన్ని బంగారు నాణేలు దొరికాయట, వీళ్లకు ఇన్ని దొరికాయట అనే పుకార్లు షికార్లు చేయడంతో, ఊరి జనం మట్టి తవ్వకాలు చేపట్టారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అంటూ.. మట్టిలో గోల్డ్ కాయిన్స్ కోసం తెగ వెతికేస్తున్నారు.
దీనంతటికి కారణం.. ఇదిగో ఈ రాజ్‌గఢ్ రాజకోట. అది ఈ గ్రామం దగ్గర్లోనే ఉంది. రాజ్‌గఢ్ ప్యాలెస్‌ను.. ఓబెరాయ్ గ్రూప్ లగ్జరీ హోటల్‌గా మారుస్తున్న సమయంలో భారీగా తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో వచ్చిన మట్టిని సమీపంలో ఉన్న గ్రామం దగ్గర రోడ్డుపై పోశారు. ఆ మట్టిలో, కొందరికి 50 నుంచి 100 బంగారు నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఈ నాణేలు ప్రకాశవంతంగా, పాతవిగా కనిపిస్తున్నాయి. ప్రజలు వీటిని సుమారు 500 ఏళ్ల నాటి బంగారు నాణేలుగా అనుమానిస్తున్నారు. కానీ, నిపుణులు ఇంకా తనిఖీ చేయలేదు. వీటి విలువ, ప్రాచీనత గురించి అధికారికంగా నిర్ధారించలేదు. అయితే ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్లంతా, బంగారు నాణేల కోసం వేట సాగిస్తున్నారు.
వీడియో చూడండి..
TV9 ప్రతినిధి ఆ ఊరికి వెళ్లి, సర్పంచ్‌తో మాట్లాడితే, ఆయన అసలు నిజం కక్కేశారు. తమ గ్రామంలో బంగారు నాణేలు దొరికిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు.
కొద్ది రోజుల క్రితం..కర్నాటకలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్తనిధి బయటపడింది. గంగవ్వ బసవరాజ్ ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు కిలో బరువు ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా అదే సీన్ రిపీటయింది. అందుకేనేమో మన దేశాన్ని రత్నగర్భ అన్నారు పెద్దవాళ్లు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
