Medaram Jathara: తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మొక్కులు చెల్లించుకోవడానికి కోళ్లు, మేకలను సమర్పిస్తుండగా, వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు. సాధారణంగా కిలో రూ.420 ఉండే మేకపోతు ధర రూ.900-1000కి, రూ.170-180 ఉండే కోడి ధర రూ.300-350కి చేరింది. మటన్ ధర ఏకంగా రూ.1500కు పెరిగింది. నాటుకోడి కూడా రూ.700కు అమ్ముడవుతోంది.