Medaram: వనమెల్లా జనమే.. గద్దెపైకి సమ్మక్క.. మేడారంలో అద్భుత దృశ్యం.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండో రోజు అత్యంత వైభవంగా జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచిన ఈ వేడుకకు భక్తులు, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లు అమ్మవార్లకు తులాభారం తూగి నిలువెత్తు బంగారం సమర్పించారు. సారలమ్మ, సమ్మక్క దేవతల ఆగమనంతో జాతర కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

మేడారం సమక్క, సారలమ్మ జాతర రెండో రోజు అంగరంగవైభవంగా కొనసాగింది. ఈ రోజు జాతరలో మరో కీలక ఘట్టం భక్తులను కనులవిందు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు అటు సాధారణభక్తులతో పాటు, పొలిటికల్ వీఐపీల తాకిడి కూడా అంతకంతకూ ఎక్కువవుతోంది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లు. తులాభారం తూగి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.
మేడారం జాతర రెండో రోజుకు చేరుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం గద్దెలపైకి సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు చేరుకోగా ఈ సాయంత్రం సమ్మక్క ఆగమనం జరిగింది. చిలుకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువచ్చారు పూజారులు.
ఇక జాతర రెండో రోజూ సందర్శనకు వచ్చిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య వనదేవతలను దర్శించుకున్నారు. గత 30 ఏళ్లుగా మేడారం జాతరతో తనకు అనుబంధముందని రాజయ్య అన్నారు.
లైవ్ అప్‌డేట్స్ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
