AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అక్రమంగా నిల్వ చేస్తే అంతే.. వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!

నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపులో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు తీవ్రతకు సెల్లార్‌లో అక్రమ నిల్వలే అనే ఆరోపణలు రావడంతో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ నగరంలో అక్రమంగా గోడౌన్ గా మార్చిన సెల్లార్ లపై తనిఖీలు చేపట్టారు. ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Hyderabad: అక్రమంగా నిల్వ చేస్తే అంతే.. వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!
Commercial Complex Inspections
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jan 29, 2026 | 10:04 PM

Share

నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని సాయి బిశ్వాస్ చాంబర్స్‌లోని బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్‌లో శనివారం మధ్యాహ్నం సెల్లార్‌లో మంటలు చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 18 గంటల పాటు కొనసాగిన ఈ ప్రమాదంలో మహ్మద్ ఇంతియాజ్, సయ్యద్ హబీబ్, బీబీలతో ప్రణీత్, అఖిల్‌తో సహా ఐదుగురు మరణించారు. అయితే ఈ ప్రమాదం తీవ్రతకు సెల్లర్‌లో ఉంచిన పెయింట్లు, రసాయనాలు, చైనా నుంచి వచ్చిన సరుకులు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు హైడ్రా కమినర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

హైడ్రా కమిషనర్ ఆదేశాలతో నగరవ్యాప్తంగా కమర్షియల్ కాంప్లెక్స్ లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖలు కలిసి చేసిన తనిఖీల్లో ఫర్నిచర్ షాపుల్లో అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలు, ప్రమాదకర నిల్వలు గుర్తించి స్టాండెడ్ ఫర్నిచర్ షాప్ సీజ్ చేసారు. ఇక బచ్చాస్ ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బచాస్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో తనిఖీలు కొనసాగుతున్నాయి, ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

అయితే సామాన్య ప్రజలు ఎవరైనా సెల్లార్లను అక్రమంగా గుర్తించి గోడౌన్లుగా మారిస్తే హైడ్రాకు సమాచారం అందించాలని కమిషనర్ రంగానాథ్ కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను వీడియోలు, ఫోటోల రూపం లో 9000113667కు పంపాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.