Bank Jobs 2026: నెలకు రూ.లక్ష జీతంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు
Central Bank of India Jobs 2026: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్ పోస్టులు 50, మార్కెటింగ్ ఆఫీసర్ 1 పోస్టులు 300 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 3వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ లేదా పీజీడీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్‌కు ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్ పోస్టులకు విద్యార్హతలతోపాటు బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్‌కు మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో బీఎఫ్ఎస్‌ఐలో అనుభవం ఉండాలి. స్కేల్ 3 పోస్టులకు 30 నుంచి 38 ఏళ్లు, స్కేల్ 1 ఖాళీలకు 23 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ముగింపు గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు రూ.175 తప్పనిసరిగా చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2026.
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి లేదా మార్చి 2026లో ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ: మార్చి లేదా ఏప్రిల్ 2026 ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




