AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత దారుణం.. ఐదేళ్ల బాలుడ్ని ఎరగా వాడిన ICE

ఎంత దారుణం.. ఐదేళ్ల బాలుడ్ని ఎరగా వాడిన ICE

Samatha J
|

Updated on: Jan 29, 2026 | 12:40 PM

Share

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మినియాపోలిస్‌లో ఒక అమెరికా పౌరుడిని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపగా, అంతకుముందు ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారతీయ వలసదారుల అరెస్టులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నియమాలు మరింత ప్రమాదకరంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల ప్రవర్తన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇటీవల మినియాపోలిస్‌లో 37 ఏళ్ల అలెక్స్ ప్రెట్టి అనే అమెరికా పౌరుడిని కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అధికారుల వాదనలకు విరుద్ధంగా, ప్రెట్టి వద్ద కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు మహిళలను కాపాడే ప్రయత్నంలో ప్రెట్టిని అదుపులోకి తీసుకుని, ఆపై కాల్చి చంపారు.ఈ నెలలోనే ఇది రెండో కాల్పుల ఘటన. జనవరి 7న రెనీ గూడ్ అనే మరో అమెరికా పౌరుడు కూడా ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించాడు. అంతకుముందు, ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడి అతని తల్లిదండ్రులను అరెస్టు చేసిన ఘటన కూడా అమెరికాను కుదిపేసింది.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌