AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

Samatha J
|

Updated on: Jan 29, 2026 | 7:23 AM

Share

గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గేదే లేదంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది బంగారం ధర ఆకాశాన్నంటుతూ రికార్డులను బద్దలు కొట్టడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2026 జనవరి నెలలోనే బంగారం ధరలు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మరో చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తొలిసారిగా ఔన్సుకు $5,100 మార్కును దాటింది.

ఇప్పుడు మార్కెట్లు ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మార్చి నెలలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ తీసుకునే నిర్ణయం బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. ఇదిలా ఉంటే జనవరి 27 మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.12,000లు పెరిగి రూ.3,87,000లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,100, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,600 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,950ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,450పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,63,200లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,600 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,950 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,450 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,61,950 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,48,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,87,000 పలుకుతోంది.