AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్

పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్

Samatha J
|

Updated on: Jan 29, 2026 | 2:10 PM

Share

విజయవాడలో బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె ఏపీపీఎస్సీ పరీక్షలకు ఆటంకం కలిగించింది. యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఆర్సీఎం హైస్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు నిరసన ప్రదర్శనల మైకు శబ్దాలు, నినాదాలతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. తమ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో తల్లిదండ్రులు సమ్మెను నిలిపివేయాలని కోరారు.

విజయవాడ: దేశవ్యాప్తంగా ఐదు రోజుల పని దినాల కోసం బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె, విజయవాడలోని ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రంలో గందరగోళానికి దారితీసింది. యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ఉన్న ఆర్సీఎం హైస్కూల్‌లో జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరైన వందలాది మంది విద్యార్థులకు, నిరసన ప్రదర్శనల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడింది. పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలులో ఉండాలన్నప్పటికీ, బ్యాంక్ ఉద్యోగులు మైకులు, సౌండ్ బాక్సులతో నిరసన తెలపడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏలూరు, చింతలపూడి వంటి దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు తమ పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుందని ఆందోళన చెందారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్న ఈ పరీక్షలు కీలకమైనవి కాబట్టి, కనీసం ఆ సమయం వరకైనా సమ్మెను వాయిదా వేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌