AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: గ్రహాల అనుకూలత.. ఇక వారికి అదృష్టం, కొత్త జీవితం పక్కా..!

Telugu Astrology: మిథున రాశిలో గురు, మకర, కుంభ, మీన రాశుల్లో రవి, బుధ, కుజ, శుక్రుల సంచారం వల్ల కొన్ని రాశులవారు ఒకటి రెండు నెలల్లో ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచయినా కోలుకుని, కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా చితికిపోయినా, అప్పుల పాలైనా, ఉద్యోగాలు కోల్పోయినా, ఇబ్బందులు పడుతున్నా క్రమంగా ఈ సమస్యల నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభించగలుగుతారు. వీరికి మంచి అవకాశాలు, అదృష్టాలు అంది వస్తాయి. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు చెందిన వారికి అదృష్టం పట్టబోతోంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 29, 2026 | 6:42 PM

Share
మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో పాటు మూడు శుభ గ్రహాలు మరో మూడు నెలల వరకు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల వారు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన కష్ట నష్టాల్లో ఉన్నా క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఇతరుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందడం, మంచి అవకాశాలు లభించడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, లాభ స్థానంలో శని సంచారం వల్ల ఫిబ్రవరి, మే నెలల మధ్య వీరు కష్టనష్టాల నుంచి, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని మంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలోకి ప్రవేశించడానికి ఆఫర్లు అందుతాయి. వివాదాల్లో చిక్కుకుని ఉన్న ఆస్తికి సానుకూల పరిష్కారం లభించి కొంత ఊరట కలుగుతుంది.

2 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉండడం, శుక్ర, బుధుల అనుకూలం సంచారం వల్ల ఆదాయం క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. మే చివరి లోగా వీరు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆర్థిక, నిరుద్యోగ సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా వీరు అతి సమీప భవిష్యత్తులో బాగా కోలుకుని, తమ కాళ్ల మీద తాము నిలబడడం జరుగుతుంది. వీరికి మంచి ఉద్యోగం లభిస్తుంది.

3 / 6
కన్య: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడు, ధనాధిపతి శుక్రుడు మిత్ర క్షేత్రంలో బలంగా ఉండడంతో పాటు, దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల తోడ్పాటుతో జీవితంలో నిలదొక్కుకోవడానికి, తన కాళ్లపై తాను నిలబడడానికి అవకాశం లభిస్తుంది. పేదరికం, నిరుద్యోగం నుంచి బయటపడడానికి, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశాలు లభిస్తాయి.

4 / 6
ధనుస్సు:ఈ రాశికి రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ధన స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అధ్వాన స్థితి నుంచి ఉచ్ఛస్థితికి ఎదగడం ప్రారంభం అవుతుంది. ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభించి కోలుకునే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో  ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

5 / 6
కుంభం: ఈ రాశికి ఏలిన్నాటి శని జరుగుతున్నప్పటికీ, గురు దృష్టి వల్ల ఈ శని ప్రభావం బాగా తగ్గిపోవడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన దుస్థితి నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఎక్కువగా స్వయం కృషితో ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక సమస్యల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. గ్రహ బలం వల్ల ఈ రాశివారు ఎంత ప్రయత్నిస్తే అంతగా లాభిస్తుంది. సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

6 / 6
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్