కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
కర్ణాటకలోని బెళగావిలో కొబ్బరికాయల ట్రక్కులో అరుదైన విటేకర్స్ బోవా పాము కలకలం సృష్టించింది. గోవా నుండి వచ్చిన సరుకు అన్‌లోడ్ చేస్తుండగా చివరి సంచిలో పాము బయటపడింది. వ్యాపారి జస్వంత్ సమాచారంతో స్నేక్ క్యాచర్ ఆనంద్ చిట్టి దానిని రక్షించి, అటవీశాఖ సహకారంతో గోవా సరిహద్దు అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. గోవా నుంచి కొబ్బరికాయలను రవాణా చేస్తున్న ట్రక్కులోని సంచులను అన్‌లోడ్ చేస్తుండగా షాకింగ్ సంఘటన జరిగింది. దాదాపు ట్రక్కులోని అన్ని సంచులను దించిన తర్వాత, చివరి సంచిని తీయగా ఒక్కసారిగా పెద్ద పాము బుసలు కొడుతూ పైకి లేచింది. ఈ ఘటన బెళగావి శనివార్ ఖుంట్ ప్రాంతంలోని కొబ్బరి వ్యాపారి జస్వంత్ గోరల్ దుకాణంలో జరిగింది. ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. కొబ్బరి సంచులను దించుతుండగా పామును గమనించిన వ్యాపారి జస్వంత్, వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ ఆనంద్ చిట్టికి సమాచారం అందించారు. ఆనంద్ చిట్టి వెంటనే అక్కడికి చేరుకుని పామును రక్షించారు.
మరిన్ని వీడియోల కోసం :
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

