హైదరాబాద్లో బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. కేవలం పదిహేను సెకన్లలో ఓ దొంగ అతని రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి పరారయ్యాడు. ఈ దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభమైంది.