బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో విమాన అటెండెంట్ పింకీ మాలి మరణించారు. ప్రమాదానికి కొన్ని గంటల ముందు తండ్రి శివకుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో వెళ్తున్నానని, తర్వాత కాల్ చేస్తానని చెప్పిన ఆమె చివరి మాటలే తండ్రికి మిగిలాయి. కుమార్తె మరణవార్త వినగానే తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.