AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. ఆ సేవలు బంద్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్ మార్చింది. క్రెడిట్ కార్డు వాడేవారికి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్పులను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ మేరకు కస్టమర్లు అందరికీ మెస్సేజ్‌లు పంపిస్తోంది.

ICICI Bank: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. ఆ సేవలు బంద్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
Icici Bank
Venkatrao Lella
|

Updated on: Jan 29, 2026 | 8:38 PM

Share

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి ఆ బ్యాంక్ షాకిచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్దమైంది. పలు సేవలను నిలిపివేయనుండగా.. మరికొన్ని కొత్త మార్పులను తీసుకురానుంది. దీంతో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాక్ తగలనుంది. బుక్ మై షో టికెట్లపై ఫ్రీ టికెట్స్ బంద్ కావడంతో పాటు అనేక నిబంధనలను మార్చుతోంది. అలాగే రివార్డ్ పాయింట్లు, ఇన్యూరెన్స్, ట్రాన్స్‌పోర్ట్ పేమెంట్స్‌ ఎలా ఉంటాయి.. వివిధ కేటగిరీల క్రెడిట్ కార్డులపై ఐసీఐసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే వివరాలు ఇందులో చూద్దాం

బుక్ మై షో కాంప్లిమెంటరీ టికెట్స్ రద్దు

ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటివరకు క్రెడిట్ కార్డులపై బుక్ మై షో కాంప్లిమెంటరీ సినిమా టికెట్లు అందిస్తోంది. కానీ ఇప్పుడు వాటిని తొలగిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం చిప్, ఇన్‌స్టాంగ్ ప్లాటినం క్రెడిట్ కార్డులపై బుక్ మై షో కాంప్లిమెంటరీ టికెట్ల సేవలను ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఇన్యూరెన్స్, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఇక సినిమాలు, రవాణా లేదా ఇన్యూరెన్స్ పేమెంట్స్ చేస్తే ఇచ్చే రికార్డ్ పాయింట్లు కూడా కొనసాగుతాయని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే ఐసీఐసీఐ సూపర్ సేవల్ హెచ్‌పీసీఎల్ క్రెడిట్ కార్డు కస్టమర్లుకు రికార్డ్ పాయింట్స్ ఎక్కువగా రానున్నాయి. వీరికి ఇన్యూరెన్స్ పేమెంట్స్‌పై రూ.40 వేల వరకు రివార్డ్ పాయింట్లు అందుతాయని పేర్కొంది.

రూ.40 వేల వరకు రివార్డ్ పాయింట్స్

అలాగే హెచ్‌సీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డుల నుంచి ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని ఐసీఐసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయంటూ కస్టమర్లకు ఈ మెయిల్స్ ద్వారా సమాచారం పంపుతోంది. అటు జనవరి 15వ తేదీ నుంచి రిటైల్ క్రెడిట్ కార్డుల ఛార్జీలను ఐసీఐసీఐ సవరించింది. ఆన్‌లైన్ గేమింగ్, రమ్మీ కల్చర్ డ్రీమ్ 11, జంగ్లీ గేమ్స్, ఎంపీఎల్ వంటి ఫ్లాట్‌ఫామ్‌లలో చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను పెంచింది. వాటిల్లో చేసే లావాదేవీలకు 2 శాతం ఛార్జ్ చేయనుంది. ఇక థర్డ్ పార్టీ వాలెట్ లోడింగ్ రూ.5 వేలు కంటే ఎక్కువ చేస్తే 1 శాతం ఫీజు వసూలు చేయుంది. ఈ మార్పులు, రూల్స్‌ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు వాడేవారందరూ గమనించాలని సూచించింది. వీటిని దృష్టిలో పెట్టుకుని క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా