AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. రూ.2.83 లక్షలకు ఛాన్స్.. ? వెండి 8 లక్షలపైనే..

బంగారం ధరలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతోంది. ఒక్కసారిగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నాయి. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో బంగారం ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

Venkatrao Lella
|

Updated on: Jan 29, 2026 | 6:01 PM

Share
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్ధిక ఒడిదొడుకుల క్రమంలో ప్రపంచవ్యా్ప్తంగా పసిడి ధరలు ఊహించని స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు బిగ్గెస్ట్ ఆల్ టైం రికార్డ్ సృష్టించాయి. తులం బంగారం ఏకంగా రూ.1.8 లక్షల మార్క్‌కు చేరుకోగా..కేజీ సిల్వర్ ధర 4 లక్షల రూపాయల మార్క్‌ను అధిగమించింది. ట్రంప్ వరుస ప్రకటనలు, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలతో బంగారం రేట్లు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి.

1 / 5
ఈ క్రమంలో పసడి ధరలు ఇంకెంత పెరుగుతాయే దానిపై బ్యాంక్ ఆఫ్ కెనడా సంచలన అంచనా వేసింది. 2027 నాలుగో త్రైమాసికం నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.2.83 లక్షలకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది.  ఇక వెండి ధరలపై కూడా షాకింగ్ రిపోర్ట్ బయటపెట్టింది. కేజీ వెండి ధర 2027 నాటికి రూ.7.20 లక్షలకు చేరుకుంటుందని తన అంచనాలో పేర్కొంది.

2 / 5
ప్రపంచ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2027 నాటికి బంగారం ధర ఔన్సుకు 8,650 డాలర్లకు చేరుకుంటుందని కెనడియన్ బ్యాంక్ తెలిపింది. ఇక వెండి ధర ఔన్సుకు 220 డాలర్లకు చేరుకోవచ్చని తన నివేదికలో వెల్లడించింది. ఆర్ధిక వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి, కరెన్సీల బలంపై అనిశ్చితితో బంగారం, వెండి వైపు పెట్టుబడులు పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది.

3 / 5
గత సంవత్సరం ప్రారంభంతో ఔన్సుకు బంగారం ధర 5 వేల డాలర్ల కంటే ఎక్కువగా పెరిగి మార్కెట్ వర్గాలకు షాక్ ఇచ్చింది. యూఎస్ డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపింది. జపాన్ బాండ్లలో పదునైన అమ్మకాలు, యెన్‌లో అధిక అస్ధిరతతో బంగారం వైపు పెట్టుబడులు పెరిగాయని స్పష్టం చేసింది.

4 / 5
ఇక 2026 నాలుగో త్రైమాసికం నాటికి సగటున 8 మిలియన్ ఔన్సుల బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటే.. త్రైమాసికానికి 4 నుంచి 5 మిలియన్ ఔన్సుల ఈటీఎఫ్‌లు అలాగే ఉంటే బంగారం ధరలు పెరుగుతాయని కెనడియన్ బ్యాంక్ తన రిపోర్టులో వెల్లడించింది. డాలర్ బలహీనపడితే 2026 క్యూ4 నాటికి ఔన్సుకు 6,350 డాలర్లకు బంగారం చేరుకుంటుందని పేర్కొంది.

5 / 5