AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం తెలిస్తే షాకే..

నిద్రలో గురక పెట్టడం అనేది చాలా మంది దృష్టిలో ఒక సాధారణ విషయం. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ శబ్దం మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉందనే దానికి ముందస్తు సంకేతం కావచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? అసలు గురక ఎందుకు వస్తుంది? అనేది తెలుసుకుందాం..

మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం తెలిస్తే షాకే..
Why Men Snore More Than Women
Krishna S
|

Updated on: Jan 29, 2026 | 8:46 PM

Share

రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే గురక శబ్దం వినడానికి సామాన్యంగా అనిపించినా దాని వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా గురక పెట్టడానికి గల కారణాలను వైద్య నిపుణులు శాస్త్రీయంగా వివరిస్తున్నారు.

అసలు గురక ఎందుకు వస్తుంది?

నిద్రపోతున్నప్పుడు ముక్కు, గొంతులోని వాయుమార్గం పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమయంలో గాలి లోపలికి వెళ్లేటప్పుడు గొంతులోని కణజాలాలు కంపనానికి గురవుతాయి. ఈ కంపనమే మనకు గురక శబ్దంగా వినిపిస్తుంది.

పురుషుల్లోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువ?

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ENT విభాగం అధిపతి డాక్టర్ రవి మహర్ ప్రకారం.. మహిళల కంటే పురుషుల గొంతులోని వాయుమార్గం సహజంగానే ఇరుకైనది. ఇది నిద్రలో ఎక్కువ కంపనాన్ని కలిగిస్తుంది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు వాయుమార్గ కండరాలను బలంగా ఉంచుతాయి. పురుషులకు ఈ హార్మోన్ రక్షణ తక్కువగా ఉంటుంది. పురుషులకు గొంతు, మెడ చుట్టూ కొవ్వు చేరే అవకాశం ఎక్కువ. ఇది శ్వాస నాళంపై ఒత్తిడి తెచ్చి గురకకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

నిర్లక్ష్యం చేస్తే స్లీప్ అప్నియా ముప్పు

తేలికపాటి గురక సాధారణమే అయినా అది తీవ్రమైతే స్లీప్ అప్నియా అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. ఇందులో నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.

గురకను తగ్గించుకోవడానికి చిట్కాలు

  • శరీర బరువును, ముఖ్యంగా మెడ చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవాలి.
  • పడుకునే ముందు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • వెల్లకిలా పడుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవడం వల్ల వాయుమార్గంపై ఒత్తిడి తగ్గుతుంది.
  • గురకతో పాటు నిద్రలో ఆయాసం రావడం లేదా పగటిపూట విపరీతమైన నీరసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫిబ్రవరిలో పుట్టిన వారు ఎలా ఉంటారు.. ఈ సీక్రెట్స్ తెలిస్తే..
ఫిబ్రవరిలో పుట్టిన వారు ఎలా ఉంటారు.. ఈ సీక్రెట్స్ తెలిస్తే..
టీమిండియాను పట్టి పీడిస్తోన్న 3 బలహీనతలు ఇవే..
టీమిండియాను పట్టి పీడిస్తోన్న 3 బలహీనతలు ఇవే..
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే