AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

ప్రతి తండ్రికి తన కూతురు అంటే అపురూపమైన ప్రేమ.. బిడ్డను ఉన్నత చదువులు చదివించి, ఘనంగా పెళ్లి చేయాలనేది నాన్న కల. అయితే మారుతున్న కాలంలో ఆ కలలను నిజం చేసుకోవడానికి ఆర్థిక భరోసా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు ఒక మెట్టుగా మారిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఇప్పుడు ఏకంగా రూ. 72 లక్షలు పొందే అవకాశం ఉంది.

మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Sukanya Samriddhi Yojana
Krishna S
|

Updated on: Jan 29, 2026 | 5:24 PM

Share

బేటీ బచావో – బేటీ పడావో నినాదంతో 2015 జనవరి 22న ప్రారంభమైన సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం దిగులు పడాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం.. ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ పథకంలో చక్రవడ్డీ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది..

ఇలా పెడితే చేతికి రూ.72లక్షలు

వార్షిక పెట్టుబడి: రూ.1,50,000

పెట్టుబడి కాలం: 15 ఏళ్లు

ఇవి కూడా చదవండి

మెచ్యూరిటీ కాలం: 21 ఏళ్లు

ప్రస్తుత వడ్డీ రేటు: 8.20శాతం

మీరు జమ చేసే మొత్తం: రూ.22,50,000

వడ్డీ ద్వారా వచ్చే లాభం: రూ. 49,32,119

మొత్తం మెచ్యూరిటీ సొమ్ము: రూ. 71,82,119

మీరు మెచ్యూరిటీ సమయంలో పూర్తి స్థాయిలో అంటే రూ. 71.8 లక్షలు పొందాలంటే.. ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుండి 5వ తేదీ లోపు డిపాజిట్ చేయడం మర్చిపోవద్దు.

ఈ పథకం ఎందుకు ప్రత్యేకం?

ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం, కాబట్టి రిస్క్ సున్నా. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యధికంగా 8.20శాతం వడ్డీని దీనికే ఇస్తున్నారు. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. నెలకు కేవలం రూ. 250తో కూడా ఈ ఖాతాను తెరవవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన నిబంధనలు

  • పాప పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తెరవవచ్చు.
  • గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు ఈ సదుపాయం ఉంటుంది.
  • ఖాతా తెరిచినప్పటి నుండి 21 ఏళ్ల తర్వాతే డబ్బు డ్రా చేసుకోవచ్చు. అయితే పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం 50శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు
Virat Kohli: ఛేజింగ్‌లో మాస్టర్.. మరి ఆ సబ్జెక్ట్‌లో..?
Virat Kohli: ఛేజింగ్‌లో మాస్టర్.. మరి ఆ సబ్జెక్ట్‌లో..?
రైల్వే టికెట్లపై 50 శాతం రాయితీ! బడ్జెట్‌లో కేంద్రం బిగ్ డెసిషన్
రైల్వే టికెట్లపై 50 శాతం రాయితీ! బడ్జెట్‌లో కేంద్రం బిగ్ డెసిషన్