బంగారం కొంటున్నారా.. ఇది తెలియకపోతే మీ డబ్బులు గోవిందా..

Samatha

27 January 2026

మగువలు అతిగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో బంగారం రేటు విపరీతంగా పెరగడంతో కొనుగోలు చేయాలంటే భయపడి పోతున్నారు.

మగువలు

ఇక కొంత మంది ముందు ముందు బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో అనే భయం, లేదే ఏదైనా శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేస్తున్నారు.

ముందు జాగ్రత్త

అయితే బంగారం కొనుగోలు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంట. లేకపోతే, మీరు మీ డబ్బులు నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. దాని గురించి తెలుసుకుందాం.

జాగ్రత్తలు

మీరు బంగారం కొనుగోలు చేసే ముందు తప్పకుండా దానిపై హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంట. లేకపోతే అది నిజమైన బంగారం కాదని అర్థం.

హాల్ మార్క్

అలాగే  మీరు బంగారం కొనుగోలు చేసే క్రమంలో, దానిని క్యారెట్ల రూపంలో తెలుసుకోవాలి. అంతే కాకుండా బంగారం కొనుగోలు చేసిన బిల్లు తప్పకుండా తీసుకొని, దానిని భద్రపరచాలి.

బిల్లు తప్పనిసరి

అలాగే బంగారానికి మేకింగ్ ఛార్జిలు ఎలా తీసుకుంటున్నారు? వారి వెయింగ్ మిషన్ సరైనదా కాదా? వారి మాటలను అర్థం చేసుకోవడం చేయాలంట.

మేకింగ్ ఛార్జీలు

అదే విధంగా మీరు తీసుకున్న బంగారం మళ్లీ రిటర్న్ చేయవచ్చునా? అసలు ఆ షాప్ వారు మీకు ముందే తెలుసా. మన్నికైన బంగారం ఉంటుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి.

రిటర్న్

ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవడంతో, ఎక్కువ మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే బంగారం కొనుగోలు విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

జాగ్రత్తలు తప్పనిసరి