బ్లాక్ కాఫీ తాగే వారికి హెచ్చరిక.. ఇలా తాగితే అనారోగ్య సమస్యలే!

Samatha

27 January 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎంతో ఇష్టంగా బ్లాక్ కాఫీ తాగుతున్నారు.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్లాక్ కాఫీ

ప్రతి రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వలన ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది.

శరీరానికి శక్తి

అయితే బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, టీ తాగే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. లేకపోతే సమస్యలు ఎదురు అవుతాయంట.

అనారోగ్య సమస్యలు

కొందరు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతుంటారు. కానీ ఇలా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఖాళీకడుపుతో బ్లాక్ కాఫీ

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వలన ఇది ఆమ్లతత్వాన్ని పెంచుతుంది. అంతే కాకుండా భయం, ఛాతిలో అసౌకర్యం వంటి వాటికి కారణం అవుతుంది.

కడుపులో అసౌకర్యం

అలాగే కడుపు సమస్యలతో బాధపడే వారు కూడా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదంట. ఇది గ్యాస్ ఎసిడిటీ, కడుపులో మంటకు కారణం అవుతుంది.

కడుపు సమస్యలు

అందుకే ఎవ్వరైనా సరే అల్పాహారం  తీసుకున్న తర్వాత మాత్రమే కాఫీ తాగాలంట. ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో, భోజనం చేసిన వెంటనే కాఫీ తాగకూడదు.

అల్పాహారం

అదే విధంగా నిద్రపోవడానికి ముందు కూడా బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదు, ఇది నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది.

నిద్రలేమి