Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలుడిపై వీధి కుక్క దాడి. సీసీ కెమెరాలో దృశ్యాలు.
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వీధి కుక్క బాలుడిపై అటాక్ చేసిన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌లో వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఒంటరిగా రోడ్డెక్కితేచాలు.. చిన్నా పెద్దా తేడా లేకుడా.. పిక్కలు పీకేస్తున్నాయి...
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వీధి కుక్క బాలుడిపై అటాక్ చేసిన సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌లో వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఒంటరిగా రోడ్డెక్కితేచాలు.. చిన్నా పెద్దా తేడా లేకుడా.. పిక్కలు పీకేస్తున్నాయి వీధి కుక్కలు. తాజాగా.. మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో పదేళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియో భయందోళనకు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క బాలుడిపై ఒక్కసారిగా దాడికి దిగింది. కుర్రాడు ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా పదేపదే ఎగబడి కరిచేసింది. దీంతో కుర్రాడు ఎలాగొలా పరిగెడుతూ ఇంట్లోపి పరిగెట్టాడు. దీంతో కుక్క నుంచి పారిపోయింది. వెంటనే బాలుడిని పేరెంట్స్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…