Tourism: హలో హైదరాబాదీలు… చలో ఊటీ.. రూ. 9వేలకే ఆరు రోజుల ట్రిప్. పూర్తి వివరాలు.
వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా
వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దగ్గరపడింది. దీంతో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌లు చేస్తున్నారు. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ఓ మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ కర్ణాటకలోని పలు ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా ఈ ట్రిప్ సాగుతుంది. బెంగళూరు – ఊటీ – మైసూర్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
మొదటి రోజు: టూర్‌లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభమవుతుంది. యాత్రి నివాస్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు, బషీర్‌బాగ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణించి ఉదయం బెంగళూరు చేరుకుంటారు.
రెండో రోజు: రెండో రోజు బెంగళూరులో లోకల్ సైట్ విజిటింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా బుల్ టెంపుల్, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్ విజిటింగ్ ఉంటుంది. రాత్రి బెంగళూరులోనే బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు: ఇక మూడో రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఊటీ బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. భోజనం తర్వాత రాత్రి ఊటీలో బస ఉంటుంది.
నాలుగో రోజు: టూర్‌లో నాలుగో రోజు ఉదయం మైసూర్ వెళ్తారు. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. అనంతరం బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి భోజనం, మైసూరులో బస ఉంటుంది.
ఐదో రోజు: ఐదో రోజు ఉదయం 7 గంటలకు మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా చాముండేశ్వరి ఆలయం, మైసూరు మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ చూడొచ్చు. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి మైసూర్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. వ
ఆరో రోజు: ఆరో రోజు తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ధర విషయానికొస్తే..
ఇక ఈ టూర్ ధర విషయానికొస్తే.. నాన్ ఏసీ బస్ ప్యాకేజీ పెద్దలకు రూ. 9,900, 5 నుంచి 12సంవత్సరాల పిల్లలకు రూ.7,920 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో వోల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ వసతి కవర్ అవుతుంది.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..