Hyderabad: ఉత్తర తెలంగాణ వాసులకు పండుగలాంటి వార్త.. గంటన్నర ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే.!
అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక కొత్త ఏడాది నుంచే పనులకు శ్రీకారం చుట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం, అలాగే ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులకు గత ఏడాది శంకుస్థాపన జరిగింది. ప్రైవేటు, రక్షణ శాఖ భూముల సేకరణలో జాప్యం జరిగినప్పటికీ..

నగర ఉత్తర భాగంలో కీలకంగా భావిస్తున్న షామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ దాదాపు ఖరారైంది. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు ఇప్పటికే పనులు ప్రారంభించిన హెచ్ఎండీఏ, షామీర్‌పేట్ కారిడార్‌కు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు కేఎన్ఆర్, బెక్రాం సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. అన్ని అంశాల పరిశీలన అనంతరం ఒక సంస్థను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నిధులు సమకూరుస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్‌డీబీ) తుది పరిశీలన కోసం వివరాలను హెచ్ఎండీఏ పంపినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఆమోదం లభించిన తర్వాత గుత్తేదారు సంస్థను అధికారికంగా ప్రకటించనున్నారు.
అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక కొత్త ఏడాది నుంచే పనులకు శ్రీకారం చుట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం, అలాగే ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులకు గత ఏడాది శంకుస్థాపన జరిగింది. ప్రైవేటు, రక్షణ శాఖ భూముల సేకరణలో జాప్యం జరిగినప్పటికీ తాజాగా రక్షణ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు మొత్తం 18.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈపీసీ మోడల్‌లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.2,232 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం కారిడార్‌లో 11.65 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంగా, మరో 6.52 కిలోమీటర్లు గ్రౌండ్ లెవెల్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. హకీంపేట వద్ద సుమారు 450 మీటర్ల మేర అండర్ టన్నెల్ నిర్మాణం కూడా ప్రాజెక్టులో భాగంగా ఉంది.
ఈ మార్గం వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట, తూంకుంట ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. దీని ద్వారా నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు స్పీడ్ అండ్ ఈజీ, కనెక్టివిటీ లభించనుంది. ప్రాజెక్టు అమలులో భాగంగా మొత్తం 1,100 ఆస్తులను సేకరించగా, సుమారు 2,100 చెట్లలో కీలకమైన వాటిని స్థల మార్పు(ట్రాన్స్లకేషన్) చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని అనుమతులు పూర్తైన నేపథ్యంలో, షామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








