AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Sleep: చలికాలంలో సుఖమైన నిద్రకోసం.. పడుకునే ముందు వీటిని ధరించండి!

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక సమాన్య వ్యక్తికి రోజుకు కనీసం7 నుంచి 8 గంటల మంచి నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే శీతాకాలంలో చలి కారణంగా చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. కాబట్టి శీతాకాలంలో మంచి నిద్ర కోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Winter Sleep: చలికాలంలో సుఖమైన నిద్రకోసం.. పడుకునే ముందు వీటిని ధరించండి!
Winter Sleep
Anand T
|

Updated on: Dec 16, 2025 | 10:08 AM

Share

మంచి రాత్రి నిద్ర మనల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత వర్క్ టెన్షన్, జీవనశైలి కారణంగా, చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇక చలికాంలో మరి.. తీవ్ర చలి వల్ల చాలా మంది సిరిగ్గా నిద్రపోలేక పోతున్నారు. అందుకే మంచి నిద్ర కోసం చాలా మంది ధ్యానం, యోగా, నడక వంటి పద్ధతులను అనుసరిస్తారు. అయితే చలికాలంలో మంచి నిద్రకోసం సాక్స్ ధరించి పడుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అవును నిద్రపోయే ముందు మీ పాదాలకు సాక్స్ ధరించడం వల్ల మీ పాదాలుకు వెచ్చదనం తగిలి.. మీరు హాయిగా నిద్రపోవడానికి సమాయపడుతాయి.

రాత్రిపూట సాక్స్ వేసుకుని పడుకుంటే ఏమవుతుంది?

సాక్స్ ధరించి నిద్రపోయేవారు త్వరగా నిద్రపోతారని, ఎక్కువసేపు నిద్రపోతారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వైద్య శాస్త్రవేత్త డాక్టర్ పీకిన్ లువో ప్రకారం, నిద్రపోయేటప్పుడు మీ పాదాలను వెచ్చగా ఉంచుకోవడం వల్ల నిద్రపై సానుకూల ప్రభావం ఉంటుంది. మొత్తంమీద, సాక్స్ ధరించడం వల్ల మీరు బాగా నిద్రపోతారని చెబుతున్నారు. దీని కోసం, రాత్రి పడుకునే ముందు మీ పాదాలను పూర్తిగా శుభ్రం చేసి, వాటిని పూర్తిగా ఆరబెట్టి, మంచి మాయిశ్చరైజర్ రాసుకుని, ఆపై పడుకునే ముందు సాక్స్ ధరిస్తే, మీకు మంచి నిద్ర వస్తుందని చెబుతారు.

సాక్స్ ధరించడం వల్ల నిద్ర ఎలా సహాయపడుతుంది?

పడుకునే ముందు సాక్స్ ధరించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు, రక్త నాళాలు విస్తరిస్తాయి. ఇది మెరుగైన రక్త ప్రసరణకు సహకరిస్తుంది. తద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల, పడుకునే ముందు మీ పాదాలకు సాక్స్ ధరించడం వల్ల మీరు బాగా నిద్రపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, దీనికి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇతర ప్రయోజనాలు

  • ఇది పాదాలను చలి నుండి రక్షించడమే కాకుండా, హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
  • సాక్స్ ధరించడం వల్ల మడమల పగుళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
  • సాక్స్ ధరించడం వల్ల పాదాల వాపు, నొప్పి తగ్గుతాయి.
  • క్రమం తప్పకుండా సాక్స్ ధరించడం వల్ల మీ పాదాలు అందంగా కనిపిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో సుఖమైన నిద్రకోసం.. పడుకునే ముందు వీటిని ధరించండి!
చలికాలంలో సుఖమైన నిద్రకోసం.. పడుకునే ముందు వీటిని ధరించండి!
మినీ వేలంలో 70 మంది తోపులు.. ఆరునూరైనా ఫ్రాంచైజీలు కొట్లాటకు
మినీ వేలంలో 70 మంది తోపులు.. ఆరునూరైనా ఫ్రాంచైజీలు కొట్లాటకు
అతను ఇండియాలోనే అందగాడు..
అతను ఇండియాలోనే అందగాడు..
సింహ రాశిఫలితాలు..2026లో వీరికి ఎక్కువగా కలిసివస్తుందంట!
సింహ రాశిఫలితాలు..2026లో వీరికి ఎక్కువగా కలిసివస్తుందంట!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
లావణ్య బర్త్ డే సెలబ్రేషన్స్.. కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
లావణ్య బర్త్ డే సెలబ్రేషన్స్.. కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!