IPL 2026: మినీ వేలంలో 70 మంది తోపులు.. ఆరునూరైనా ఫ్రాంచైజీలు కొట్లాటకు దిగాల్సిందే
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది. మొత్తం 1355 మంది ఆటగాళ్లలో 350 మందిని ఫైనల్ చేయగా.. లేట్ ఎంట్రీ కింద మరో ఐదుగురు ప్లేయర్స్ వచ్చారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు.? ఏంటి.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

కొద్ది గంటలే.! ఐపీఎల్ మినీ వేలం అబుదాబీ వేదికగా జరగనుంది. డిసెంబర్ 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ వేలం మొదలు కానుండగా.. మొత్తంగా 355 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్‌లో చూడవచ్చు. 77 స్లాట్ల కోసం 355 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వేలం ప్రక్రియలో మొదటి 70 మంది ఆటగాళ్లు తోపులు.. వీరిది సాధారణ వేలంలో.. ఆపై యాక్సిలరేటెడ్ వేలం.. చివరగా అమ్ముడుపోని ఆటగాళ్ల కోసం మరోసారి వేలం జరుగుతుంది.
ఐదు మార్క్యూ ప్లేయర్ సెట్లలోని కీలక ఆటగాళ్లు వీరు:
సెట్-1(బ్యాట్స్‌మెన్లు): డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా.. కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికే ఛాన్స్
ఇవి కూడా చదవండిసెట్-2(ఆల్‌రౌండర్స్): గస్ అట్‌కిన్సన్, వనిందు హసరంగా, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్, వియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర. దీపక్ హుడా
సెట్-3(వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్): ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, కేఎస్ భరత్, క్వింటన్ డికాక్, బెన్ డకెట్, రహ్మనుల్లా గుర్బాజ్, జైమీ స్మిత్.. క్వింటన్ డికాక్ అధిక ధర పలికే అవకాశం ఉంది.
సెట్-4(ఫాస్ట్ బౌలర్లు): గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ దీప్, జాకబ్ డఫీ, ఫజల్‌హక్ ఫారూఖీ, మాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, శివమ్ మావి, అన్రిచ్ నోర్ట్జే, మతీష పతిరానా
సెట్-5(స్పిన్నర్లు): రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, అకీల్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహీష్ తీక్షణ
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








