AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: కొనేస్తారు.. అందరినీ కొనేస్తారు.. రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు.!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. రూ. 43 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగుతోంది. 9 స్లాట్‌లు ఖాళీ ఉండగా.. ఆక్షన్ సెట్ల వారీగా ఏయే ఆటగాళ్లను ఎంచుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. నెంబర్ 6 ఫినిషర్, డెత్ ఓవర్ పేసర్‌లు, స్పిన్ ఆల్-రౌండర్‌ల కోసం..

IPL 2026: కొనేస్తారు.. అందరినీ కొనేస్తారు.. రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు.!
Csk Ipl 2026
Ravi Kiran
|

Updated on: Dec 15, 2025 | 8:51 AM

Share

మరికొన్ని గంటల్లో అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఫ్రాంచైజీలు అందరూ కూడా తమ వ్యూహాలను సిద్దం చేశాయి. ఈ క్రమంలోనే భారీ పర్స్‌తో బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్.. తమ జట్టులో ఖాళీగా ఉన్న 9 స్లాట్లను భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది. తొమ్మిదిలో నాలుగు విదేశీ స్లాట్లు ఉండగా.. వాటికోసం పక్కాగా కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. 6వ నెంబర్ ఫినిషర్, ఇండియన్ స్పిన్నర్, విదేశీ డెత్ ఓవర్ పేసర్, ఇండియన్ మిడిల్, డెత్ పేసర్, విదేశీ ఓపెనింగ్ బ్యాటర్, ఇండియన్ స్పిన్ ఆల్-రౌండర్, ఇండియన్ పేస్ ఆల్-రౌండర్, బ్యాకప్ ఇండియన్ ఫినిషర్, విదేశీ స్పిన్ ఆల్-రౌండర్ కోటాలను చెన్నై భర్తీ చేయాల్సి ఉంది.

వేలం ప్రారంభం కాగానే మొదటి సెట్‌లో కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్‌లను సీఎస్కే లక్ష్యంగా చేసుకునే ఛాన్స్ ఉంది. ఆరో నంబర్‌లో గ్రీన్ లాంటి ఆల్‌రౌండర్ జట్టుకు చాలా ముఖ్యం. అతడి బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్ ఎక్స్‌ట్రా అడ్వాన్‌టేజ్. అయితే, గ్రీన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రెండో సెట్‌లో వెంకటేష్ అయ్యర్, వనిందు హసరంగ, దీపక్ హుడా, వియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి ఆటగాళ్లు.. మూడో సెట్‌లో బ్యాకప్ విదేశీ ఓపెనర్ కోసం ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, బెన్ డకెట్, రహ్మనుల్లా గుర్బాజ్, జామీ స్మిత్ లాంటి ప్లేయర్స్ చెన్నైకి బెస్ట్ ఆప్షన్.

నాలుగో సెట్‌లో మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్ల కోసం మతీశ పతిరానాను సీఎస్కే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆరో సెట్‌లో అభిన్ మనోహర్ లాంటి పవర్‌ఫుల్ ఫినిషర్ కోసం చెన్నై ప్రయత్నించవచ్చు. తొమ్మిదో సెట్‌లో ఇండియన్ పేసర్ల కోసం సీఎస్కే ఆకాశ్ మధ్వాల్‌ను ప్రయత్నించే ఛాన్స్ ఉంది. పదో సెట్‌లో స్పిన్ ఆల్-రౌండర్ల కోసం కుమార్ కార్తికేయను.. పన్నెండో సెట్‌లో మిల్లర్ లేదా గ్రీన్ దొరక్కపోతే జాసన్ హోల్డర్.. పదహేనో సెట్‌లో క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ల కోసం పతిరానా దొరకకపోతే ముస్తాఫిజుర్ రెహమాన్ కోసం చెన్నై ప్రయత్నిస్తుంది. ఆకాశ్ మధ్వాల్ దొరక్కపోతే చేతన్ సకారియా మరో ఆప్షన్. మొత్తంగా సీఎస్కే లక్ష్యంగా చేసుకునే ఆటగాళ్లలో కామెరూన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, జామీ స్మిత్, మతీశ పతిరానా, రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, అకీల్ హోసేన్, అభిన్ మనోహర్, కుమార్ కార్తికేయ, జాసన్ హోల్డర్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా, సోను యాదవ్, సన్నీ సంధు, తనుష్ కోటియన్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి

రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!