వైరల్ వీడియోలో వర్షంలో తడిసి ముద్దవుతున్న ఒక తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగును కాళ్ల మధ్య సురక్షితంగా ఉంచింది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా సున్నితమైనవి, తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వవని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.