అతను ఇండియాలోనే అందగాడు.. ఆ స్టార్ హీరో పై సమంత ఓపెన్ కామెంట్స్
గతంలో పోల్చితే ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్యన శుభం సినిమాతో నిర్మాతగా మారింది. ఆడియెన్స్ ను బాగానే మెప్పించిన ఈ మూవీలో ఒక కీలక పాత్ర కూడా పోషించింది సామ్. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉంటోందీ అందాల తార. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు

సమంత ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్.. డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో వీరి వివాహ వేడుక జరిగింది. అయితే సామ్, రాజ్ నిడుమోరు దంపతులకు పలువురు విషెస్ చెప్పగా.. మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సమంత చిన్న గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లో బిజీగా మారనుంది. గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది.
ఇది ఇలా ఉంటే సమంత ఓల్డ్ వీడియోకి ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కామెంట్స్ చేసింది సమంత.. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ బాబు ఇండియాలోనే చాలా హ్యాండ్సమ్ హీరో, ఆయన గుడ్ లుకింగ్ పర్సన్, మహేష్ బాబు ఇండియా లోనే అందగాడు.. అతని పక్కన నేను అందంగా కనిపించడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నా అని చెప్పుకొచ్చింది సమంత.
సమంత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో కలిసి సమంత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాల్లో కలిసి నటించారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఇటీవలే నిర్మాతగా మారి శుభం అనే సినిమా చేసింది. మహేష్ బాబు విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








