AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పీకల్లోతు చిక్కుల్లో CM నితీశ్‌.. సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగి అబాసుపాలు..! వీడియో వైరల్

ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. పరాయి మహిళ మెళ్లో దండేసి... ముస్లిం డాక్టర్ బురఖాను లాగి... ఇలా బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ ఎన్నోసార్లు నలుగురిలో అబాసుపాలయ్యార. విపక్షాలు ఎక్కితొక్కేస్తున్నా మారని ఆయన తీరు, నేనింతే టైపులో నితీశ్‌ మేనరిజమ్ వింతగా తోస్తుంది. తాజాగా వేదికపై కొత్త డాక్టర్లకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇస్తూ వేలాదిమంది జనం, మీడియా కెమెరాలు చూస్తుండగా.. చీప్‌గా బిహేవ్‌ చేశారు. మాస్ అప్పీల్‌తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకున్న సీఎం నితీశ్‌.. 75 ఏళ్ల వయసులో ఆ హుందాతనమెక్కడ? అంటూ ఏకి పరేస్తున్నాయి విపక్షాలు..

Watch Video: పీకల్లోతు చిక్కుల్లో CM నితీశ్‌.. సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగి అబాసుపాలు..! వీడియో వైరల్
Bihar CM Nitish Kumar hijab issue
Srilakshmi C
|

Updated on: Dec 16, 2025 | 9:40 AM

Share

పాట్నా, డిసెంబర్‌ 16: పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు చొక్కా నితీశ్‌కుమార్‌.. అడపాదడపా ఆవారా పనులతో ఇలా అభాసుపాలౌతున్నారు ఎందుకు? హోదాకు తగ్గ హుందాతనమెక్కడ? బిహార్ పెద్దాయనకేమైందసలు? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. వద్దు మొర్రో అంటున్నా పరాయి మహిళ మెళ్లో దండేసి… తాజాగా ఓ బహిరంగ వేదికపై ఓ ముస్లిం మహిళా డాక్టర్ బురఖాను కిందికి లాగి… నలుగురిలో అబాసుపాలయ్యాడు. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కేమైంది? వయసు మీద పడ్డ ప్రభావమా లేక, మానసిక పరిస్థితి బాగోలేదండానికి సంకేతమా? అటు, విపక్షాలు ఎక్కితొక్కేస్తున్నా, స్వపక్షం ఇరకాటంలో పడుతున్నా ఆయన తీరు మాత్రం మారడం లేదు. నేనింతే టైపులో నడుస్తోంది నితీశ్‌కుమార్ మేనరిజమ్. అసలేం జరిగిందంటే..

కొత్తగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చే కార్యక్రమం అది. పాట్నాలోని సీఎం నివాసమే వేదిక. ఎదురుగా వేలాదిమంది జనం ప్లస్ డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు. నవ్విపోదురు గాక నాకేటి.. అనుకున్నారో ఏమో ఆయుష్‌ సర్టిఫికెట్‌ను అందుకోవడానికి వచ్చిన ఒక ముస్లిం మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను కిందకు లాగి, ఆమె ముఖం చూసి ఓవరాక్షన్‌కి పాల్పడ్డారు సీఎం నితీశ్‌కుమార్. ఆ వెనకే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి నివారించే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు. సీఎం చర్యకు మహిళ స్పందించనప్పటికీ.. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. అదే స్టేజీపై ఉన్న కొందరు నవ్వుతూ కనిపించడం విడ్డూరం. ఇంకేముంది? క్షణాల్లో ఈ వీడియో వైరలైంది.

ఇవి కూడా చదవండి

నితీష్‌కుమార్‌ 100 శాతం పక్కా సంఘ్‌ కార్యకర్తగా మారిపోయారంటూ ఆర్జేడీ నుంచి అప్పుడే రియాక్షన్లొచ్చేశాయి. వెర్రివెర్రి వెరైటీలు మానుకోండి.. రాజకీయాల నుంచి తప్పుకోండి అని వార్నింగులూ జారీ ఔతున్నాయి. మరో విపక్షం కాంగ్రెస్‌ కూడా నితీష్‌ మేనరిజాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇదేం పొయ్యే కాలమయ్యా? అని సోషల్ మీడియాలో సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలో మహిళలకు భౌతిక భద్రతే కాదు, నైతిక భద్రత కూడా లేదన్న నినాదాన్ని ముందుకు తెస్తోంది అపోజిషన్ పక్షం. ఈ మొత్తం వ్యవహారంలో లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోయేది ఎవరంటే జేడీయూ లీడర్లు, క్యాడర్లు.

ఒకప్పుడు గ్రౌండ్‌టుఎర్త్‌ మేనరిజమ్‌తో మాంచి మాస్ అప్పీల్‌తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న లాలూ ఒకవైపు.. చిత్రవిచిత్రమైన చేష్టలతో నెగిటివ్ వార్తల్లో నలుగుతున్న నితీష్‌ మరోవైపు… తూకమేసి చూసుకుంటోంది బిహార్ ప్రజానీకం. 75 ఏళ్ల వయసులో హుందాగా వ్యవహరించాల్సిన నితీష్ కుమార్‌ ఎందుకిలా చేస్తున్నట్టు? ఆయన మానసిక పరిస్థితి క్షీణిస్తోందా? అని కొత్తకొత్త అనుమానాలు పుట్టి, పార్టీకి తలవొంపులొచ్చే పరిస్థితి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.