Hyderabad: బాబా వేషంలో ఎంట్రీ.. పసుపు, కుంకుమ చల్లగానే సృహ తప్పిన మహిళ.. కట్ చేస్తే..

హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో దొంగ బాబా హల్చల్ ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. మాయమాటలు చెప్తూ ఇంట్రీ ఇచ్చిన బాబా ఇల్లు గుల్ల చేశాడు. మహిళ తేరుకునే లోపే బంగారం దోచేశాడు.

Hyderabad: బాబా వేషంలో ఎంట్రీ.. పసుపు, కుంకుమ చల్లగానే సృహ తప్పిన మహిళ.. కట్ చేస్తే..
Fake Baba
Follow us

|

Updated on: Jan 29, 2023 | 11:26 AM

హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో దొంగ బాబా హల్చల్ ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. మాయమాటలు చెప్తూ ఇంట్రీ ఇచ్చిన బాబా ఇల్లు గుల్ల చేశాడు. మహిళ తేరుకునే లోపే బంగారం దోచేశాడు. మత్తుమందు చల్లి బంగారం మటుమాయం చేసిన బాబా.. మరో రెండిళ్లలో యత్నించగా ప్లాన్ బెడిసికొట్టింది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి-రాము దంపతులు నివసిస్తున్నారు. రాము ఓ చిన్నపాటి వ్యాపారి. కాషాయ దుస్తులు ధరించిన బాబా వరలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెతో మాటలు కలుపుతూ ఏదో మత్తుమందు చల్లాడు. దీంతో వరలక్ష్మి బాబా చెప్పినట్లు ఆడింది. తన మెడలో ఉన్న గొలుసు తీసి బాబాకు ఇచ్చింది. గొలుసు తీసుకున్న బాబా మెల్లగా బయటకు వెళ్లిపోయాడు.

ఇదంతా జరుగుతున్నా ఆమెకు ఏమీ తెలియదు. వరలక్ష్మిపై మత్తుమందు చల్లిన బాబా బురిడీ కొట్టించాడు. వరుసగా పక్క ఉన్న రెండిళ్లలోకి కూడా వెళ్లాడు దొంగ బాబా. కానీ అక్కడ ఎవరూ దొంగ బాబా చేతిలో మోసపోలేదు. సకాలంలో మహిళ భర్త రావడంతో బాబా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డు అయింది.

ఈ దొంగ బాబా చోరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగబాబు కోసం గాలిస్తున్నారు. ఇతగాడు ఇంకా ఎలాంటి పద్ధతుల్లో దోచుకున్నాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు.. సిసి కెమెరాల ఏర్పాటు నేరాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బురిడి బాబా అరెస్ట్..

కాగా, బురిడీ బాబాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఇంద్రప్రస్తా కాలనీలో మహిళ మెడ లో నుండి మంగళ సూత్రాన్ని లాక్కిళ్లిన  బురిడీ బాబాను నందనవనం లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.