Hyderabad Nizam: హైదరాబాద్ నిజాం కొత్త వారసుడు వచ్చేశాడు..! ప్రకటించిన చౌమహల్లా ప్యాలెస్‌.. వీడియో.

Hyderabad Nizam: హైదరాబాద్ నిజాం కొత్త వారసుడు వచ్చేశాడు..! ప్రకటించిన చౌమహల్లా ప్యాలెస్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 29, 2023 | 8:59 AM

హైదరాబాద్‌ నిజాం వారసుడిని ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్‌. ప్రిన్స్‌ ముకర్రమ్‌ ఝా మృతి అనంతరం ఆయన వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ ఝాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు.


హైదరాబాద్‌ నిజాం వారసుడిని ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్‌. ప్రిన్స్‌ ముకర్రమ్‌ ఝా మృతి అనంతరం ఆయన వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ ఝాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. నిజాం చివరి వారసుడు ప్రిన్స్‌గా పేరొందిన ముకర్రమ్‌ ఝా మరణించడంతో ఆయన కుమారుడు అజ్మత్‌ ఝాను వారసుడిగా ఎంపిక చేశారు. 1960లో జన్మించిన అజ్మత్‌ ఝా లండన్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ‌గా చేశారు. హాలీవుడ్‌ దిగ్గజాలు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, రిచర్డ్‌ అటెన్‌బరోలతో కలిసి పనిచేశారు. పలు లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తండ్రి ముకర్రమ్‌ ఝా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 29, 2023 08:59 AM