Kadiyam Sri Hari: 22 ల్యాండ్ కృజర్లు కొనుగోలు అందుకే.. కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ నేత కౌంటర్..
తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ల్యాండ్ కృజర్ కార్లు కొనుగోలుపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వినియోగం కోసం కొత్తగా 22 ల్యాండ్ కృజర్ లు కొనుగోలు చేస్తే తప్పేముంది అన్నారు. అందులో ఏమైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు.

తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ల్యాండ్ కృజర్ కార్లు కొనుగోలుపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వినియోగం కోసం కొత్తగా 22 ల్యాండ్ కృజర్ లు కొనుగోలు చేస్తే తప్పేముంది అన్నారు. అందులో ఏమైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ ను ఆసుపత్రి చేస్తామని చెప్పారు.. ఇప్పుడు అందులో ఎవరు ఉన్నారని అడిగారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ మంత్రులు కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లి అక్కడి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేసేందుకు కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు.
శ్వేత పత్రాలు అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పానలి నిలదీశారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. అంచనా పెంచడానికి కారణం.. మూడు బ్యారేజీలు, పవర్ జెనరేట్ ప్రోజెక్ట్లు, సబ్ స్టేషన్లు, లిఫ్టులు ఏర్పాటు చేయడమే అని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద 19,20,21 పిల్లర్లు కుంగటం దురదృష్టకరం అన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురండి.. బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కూడా అవగాహన లేకుండా తీర్పు ఇస్తున్నారని తెలిపారు.
పూర్తి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




