AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బడికి వెళ్లిన నలుగురు తొమ్మిదో తరగతి అమ్మాయిలు మిస్సింగ్.. పోలీసులు సెర్చ్ చేయగా

పాఠశాలకు వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తమ పిల్లల ఆచూకి కనుగొనాలంటూ మావల పోలీసు స్టేషన్‌కు వెళ్లి బోరుమన్నారు. నలుగురు మైనర్ బాలికలు మిస్సవ్వడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. స్పెషల్ టీమ్స్ బృందాలుగా విడిపోయి బాలికల ఆచూకీ కనుగొన్నారు.

Telangana: బడికి వెళ్లిన నలుగురు తొమ్మిదో తరగతి అమ్మాయిలు మిస్సింగ్.. పోలీసులు సెర్చ్ చేయగా
Girls (Representative Image)
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2023 | 6:57 PM

Share

ప్రజంట్ సొసైటీలో సోషల్ మీడియా చేస్తున్న చేటు ఇది. ఇంటి నుంచి చప్పిడి కాకుండా పారిపోయిన తొమ్మిదో తరగతి చదివే నలుగురు బాలికలను నిజామాబాద్ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణం దోభీ కాలనీకి చెందిన నలుగురు బాలికలు స్థానికంగా ఉన్న ZPHS బాలికల హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. రోజులానే స్కూల్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి… బడికి ఎగనామం పెట్టి ఇన్​స్టాగ్రాం ద్వారా పరిచయం అయిన అబ్బాయిలతో పారిపోయేందుకు ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో వారంతా బస్సు ద్వారా నిజామాబాద్  వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తమ పిల్లల ఆచూకి కనుగొనాలంటూ మావల పోలీసు స్టేషన్‌కు వెళ్లి బోరుమన్నారు. నలుగురు మైనర్ బాలికలు మిస్సవ్వడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. స్పెషల్ టీమ్స్ బృందాలుగా విడిపోయి గాలింపు జరిపి బాలికల ఆచూకీ కనుగొన్నారు. వారిని తల్లి తండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కౌమార దశలో ఉన్న పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలని.. వారితో స్నేహంగా మెలగాలని తల్లిదండ్రులకు ఎస్పీ సూచించారు. అప్పుడే వారి మనసుల్లో ఏమున్నా వ్యక్తపరిచే ఆస్కారం ఉంటుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ