అయ్యో పాపం.. టిఫిన్ చేద్దామని బస్సు దిగాడు.. అంతలోనే రూ.28 లక్షలు మాయం
డబ్బులుతో, విలువైన వస్తువులతో ఓ చోటు నుంచి మరోచోటుకి ప్రయాణాలు చేసేటప్పుడు గమ్యం చేరేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎక్కడైనా.. ఏ చోటైనా మనకు తెలియకుండానే అవి పడిపోవచ్చు.. లేదా ఎవరైన దొంగతనం చోయొచ్చు.

డబ్బులుతో, విలువైన వస్తువులతో ఓ చోటు నుంచి మరోచోటుకి ప్రయాణాలు చేసేటప్పుడు గమ్యం చేరేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎక్కడైనా.. ఏ చోటైనా మనకు తెలియకుండానే అవి పడిపోవచ్చు.. లేదా ఎవరైనా దొంగతనం చేయొచ్చు.. చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణస్తున్న ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకు కిందికి దిగడంతో ఏకంగా రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ భారీ చోరీ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద చోటుచేసుకుంది.
ఒడిశాలోని బరంపురం అనే ప్రాంతం నుంచి ఓ ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే ఈ బస్సు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద ఆగింది. బస్సులో ఉన్న ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకుని బస్సు దిగి ఆ హోటల్‌కు వెళ్లాడు. ఆ బస్సులో అతనికి సంబంధించిన రెండు బ్యాగులు ఉన్నాయి. అందులోని ఓ బ్యాగులో రూ.24 లక్షలు ఉండగా.. మరో బ్యాగులో రూ.4 లక్షలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ బస్సులోకి చొరబడ్డాడు. ఆ డబ్బులు ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. దీంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలో కూడా నార్కట్‌పల్లి హోటల్ వద్ద ఇలానే రెండు, మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ దొంగతనం జరిగే సమయంలో బస్సు సిబ్బందితో పాటు 27 మంది ప్రయాణికులు ఉన్నారు.



