Daggubati Purandeswari: పోలవరం ప్రాజెక్టుకు ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
Daggubati Purandeshwari: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిర్మాణానికి అవుతున్న ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోందని ఆమె అన్నారు.
Daggubati Purandeswari: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిర్మాణానికి అవుతున్న ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోందని ఆమె అన్నారు. పునరావాసానికి సంబంధించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని తెలిపారు. పోలవరం లెక్కలకు సంబంధించి ప్రభుత్వం సవరణ కోరిందని ఆ విషయంలో తాము కూడా త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవనున్నామని పురంధేశ్వరి ప్రకటించారు. కేంద్ర నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని పురంధేశ్వరి తెలిపారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మిగిలిన పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. పంచాయతీలకు నిధులు అందని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్‌లు తమను కలిసి ఆవేదనను వెళ్లబోసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని పురంధేశ్వరి ఆరోపించారు. 10 లక్షలు, 15 లక్షల రూపాయల పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం, రైతులకు నిజంగా ఏం మేలు చేశారని పురంధేశ్వరి ప్రశ్నించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..