Andhra Pradesh: ఆ ఊరి శివారులో చిరుతల సంచారం.. భయం గుప్పెట్లో స్థానికులు.. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే..
Kalyanadurgam: గతంలో చాలాసార్లు శివారు ప్రాంతంలో చిరుతలు సంచారం చేశాయని.... తమకు రక్షణ కల్పించాలని గోశాల నిర్వాహకులు కోరుకుంటున్నారు. మరోవైపు గూబనపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డుపై కారులో వెళుతున్న వారికి మరో చిరుత కనిపించడంతో ..
అనంతపురం జిల్లా,జులై26: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని శివారు కొండ ప్రాంతంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. కొండ ప్రాంతంలోకి వెళ్లిన గొర్రెల కాపరులు, పశువుల కాపరులకు చిరుత పులి కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. కొండపై చిరుత సంచారాన్ని గొర్రెల కాపరులు సెల్ ఫోన్ లో రికార్డు చేసి…అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు… కళ్యాణదుర్గం శివారులో గోశాలకు సమీపంలో కొండ ప్రాంతానికి చిరుతలు చేరాయి.
గతంలో చాలాసార్లు శివారు ప్రాంతంలో చిరుతలు సంచారం చేశాయని…. తమకు రక్షణ కల్పించాలని గోశాల నిర్వాహకులు కోరుకుంటున్నారు. మరోవైపు గూబనపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డుపై కారులో వెళుతున్న వారికి మరో చిరుత కనిపించడంతో దాన్ని కూడా సెల్ ఫోన్ లో బంధించారు…. కొద్ది సమయంలోనే కళ్యాణదుర్గం చుట్టుపక్కల రెండు చిరుతలు తారసపడడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..