AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra pradesh: మంగళగిరి చేనేతకు అరుదైన గౌరవం.. జాతీయ స్థాయిలో గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి పెట్టింది పేరు మంగళగిరి పట్టణం. ఇక్కడ తయారయ్యే చీరలకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. తాజాగా మంగళగిరి చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కింది. చేనేతకు జిఐ గుర్తింపు లభించింది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం. చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నేతన్నలతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. ఇందుకోసం దేశంలోని...

Andhra pradesh: మంగళగిరి చేనేతకు అరుదైన గౌరవం.. జాతీయ స్థాయిలో గుర్తింపు.
Mangalagiri
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 26, 2023 | 5:30 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి పెట్టింది పేరు మంగళగిరి పట్టణం. ఇక్కడ తయారయ్యే చీరలకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. తాజాగా మంగళగిరి చేనేతకు మరో అరుదైన గౌరవం దక్కింది. చేనేతకు జిఐ గుర్తింపు లభించింది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం. చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నేతన్నలతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. ఇందుకోసం దేశంలోని 75 మంది చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేశారు.

ఇందుకోసం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దేశ వ్యాప్తంగా పర్యటించాయి. ఒక బృందం మంగళగిరిలో చేనేత కార్మికులు కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని పరిశీలించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న చేనేత నేస్తం పథకంపై కూడా ఆరా తీసింది. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మంగళగిరిలో ఇంకా చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం, చేనేతను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండటంతో మంగళగిరి నేతన్నను ప్రధాని మాట్లాడేందుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖాధికారులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు.

Mangalagiri 1

ఇవి కూడా చదవండి

వచ్చే నెల ఏడో తేదీన ప్రధానితో వర్చువల్‌గా మాట్లాడేందుకు మగ్గం షెడ్ల ప్రాంగణాన్ని సిద్దం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రధాని మాట్లాడనున్న వారిని కూడా ఎంపిక చేసి వారి పేరు కేంద్రానికి పంపాలని ఎమ్మెల్యే సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి దక్కిన అరుదైన అవకాశంగా దీనిని భావిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఈ ప్రాంతం చేనేత కార్మికుడికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవ
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. గౌరవ
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..