AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eleswaram Municipality: ఏలేశ్వరం ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల తారుమారు.. 3, 7వ వార్డుల్లో గందరగోళం..!

కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల తారుమారు ఘటన కలకలం రేపింది. ఏలేశ్వరం మున్సిపాలిటీలోని 7వ వార్డులో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లలో కనిపించకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు మారిపోయాయని గుర్తించిన ఓటర్లు అధికారులను నిలదీశారు.

Eleswaram Municipality: ఏలేశ్వరం ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల తారుమారు.. 3, 7వ వార్డుల్లో గందరగోళం..!
Ballot Paper Mix Up
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 4:01 PM

Share

కాకినాడ జిల్లా: ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల తారుమారు ఘటన కలకలం రేపింది. ఏలేశ్వరం మున్సిపాలిటీలోని 7వ వార్డులో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లలో కనిపించకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు మారిపోయాయని గుర్తించిన ఓటర్లు అధికారులను నిలదీశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బ్యాలెట్ పేపర్ల మార్పిడిపై అధికారులు వివరణ ఇచ్చారు. పోలింగ్ సామగ్రిని ఆయా వార్డులకు జతపరిచే సమయంలో పొరపాటు జరిగిందని తెలిపారు. 3వ వార్డుకు వెళ్లాల్సిన బ్యాలెట్ పేపర్లు 7వ వార్డుకు, 7వ వార్డుకు వెళ్లాల్సిన బ్యాలెట్ పేపర్లు 3వ వార్డుకు చేరినట్లు వెల్లడించారు.

పోలింగ్ అధికారి ముందుగానే ఈ పొరపాటును గుర్తించినప్పటికీ, మారిన బ్యాలెట్ పేపర్ ద్వారా ఒక ఓటు పోలైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ ఓటును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదరు ఓటరుకు తిరిగి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఏలేశ్వరం ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..