AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఢిల్లీ పర్యటన రద్దు..

బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ను వణికించేందుకు సిద్ధమవుతోంది. నవంబరు 3న బాపట్ల సమీపంలో గంటకు 110 కి.మీ వేగంతో తీరం దాటే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంచుకొస్తున్న ముప్పు దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

Andhra Pradesh: ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఢిల్లీ పర్యటన రద్దు..
Ap Cm Chandrababu Reviews Cyclone Preparedness
Krishna S
|

Updated on: Nov 01, 2026 | 3:36 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కురవబోయే వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత, జలాశయాల నీటిమట్టాలు, తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విపత్తు తీవ్రత దృష్ట్యా సీఎం తన రేపటి ఢిల్లీ పర్యటనను సైతం రద్దు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితుల పర్యవేక్షణపై దృష్టి సారించారు.

బాపట్ల సమీపంలో తీరం దాటే ముప్పు

వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ప్రస్తుత వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా రూపాంతరం చెందనుంది. నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

నవంబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబరు 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు.

అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు:

అత్యంత భారీ వర్ష సూచన ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.

నవంబరు 3న అంచనా వేసిన జిల్లా సగటు వర్షపాతం

  • ఏలూరు: సుమారు 179 మి.మీ.
  • కృష్ణా: 163 మి.మీ.
  • ఎన్టీఆర్: 161 మి.మీ.
  • పశ్చిమ గోదావరి: 147 మి.మీ.
  • గుంటూరు: 119 మి.మీ.
  • బాపట్ల: 104 మి.మీ.

జలాశయాలకు వరద ముప్పు – విద్యుత్ రంగానికి నష్టం అంచనా

భారీ వర్షాల కారణంగా నవంబరు 3న విజయవాడ సమీపంలోని బుడమేరుకు సుమారు 32,500 క్యూసెక్కుల మేర భారీ ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉన్నందున రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సీఎం ఆదేశించారు. భారీ ఈదురుగాలుల ప్రభావంతో 12 జిల్లాల్లో దాదాపు 12,102 నుండి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ప్రాథమిక అంచనాలు వేసింది. అత్యవసర పునరుద్ధరణ పనులకు అవసరమైన సామగ్రి, అదనపు సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు.

అర్నబ్ పునరుద్ధరణ పనులపై ఆరా

ఇటీవల వచ్చిన అర్నబ్ తుఫాను నష్టం, సహాయక చర్యల పురోగతిని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎంతవరకు వచ్చిందో సీఎం ఆరా తీయగా, నేటి రాత్రికల్లా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

Follow Us
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే