Andhra Pradesh: ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్.? ఈ వార్తలో నిజమెంతంటే
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార మార్పిడి సులభంగా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, వెంటనే తెలసిపోయే రోజులివీ. అయితే ఈ సమాచారంలో అంత నిజమే ఉంటుందా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. రోజూ నెట్టింట ఎన్నో రకాల ఫేక్ వార్తలు...
ఆంధ్రప్రదేశ్, జులై 26: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార మార్పిడి సులభంగా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, వెంటనే తెలసిపోయే రోజులివీ. అయితే ఈ సమాచారంలో అంత నిజమే ఉంటుందా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. రోజూ నెట్టింట ఎన్నో రకాల ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
వాహనాలను నడుపుతూ.. హెడ్ సెట్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ, పాటలు వినేవారికి అలెర్ట్ అంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వెహికిల్స్ నడిపే సమయంలో ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు జరిమానా అంటూ వైరల్ అవుతోన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఈ వార్త పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఏపీ రవాణా శాఖ కమిషనర్ తేల్చి చెప్పారు. నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మకూడదని అధికారులు ప్రయాణికులకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకూడదు అనడానికి ఈ ఉదంతం మరో సాక్ష్యంగా నిలిచింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..