AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గొర్రె రక్తం కేసులో వీడని సస్పెన్స్…! బ్లడ్ బ్యాగ్స్ ఎటు వెళ్తున్నాయ్…?

రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు... ఇది ఓ కష్టజీవి పాట...! రక్తంతో నడుపుతాను దందాను ఆ రక్తమే నా దందాకు పెట్రోలు... ఇది గడ్డి కరిచయినా డబ్బు సంపాదించాలన్న పక్కా కేటుగాడి మాట...! కీసర నెత్తుటి దందా గురించి పక్కనపెడితే... అసలు ఆ బ్లడ్‌తో ఏం చేస్తున్నారు...? దేనికి ఉపయోగిస్తున్నారు...? ఆన్‌లైన్‌ ఆర్డర్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయ్...? ఆఫ్‌లైన్‌లో ఎలాంటి అరాచకాలు సాగుతున్నాయ్...? ఇవే ప్రశ్నలు కొన్నిరోజులుగా వెంటాడుతున్నాయ్...? రాకెట్‌ సైన్స్‌ మాదిరి తెగ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయ్...! మరీ బ్లడ్ మిస్టరీని చేధించేదెలా...?

Hyderabad: గొర్రె రక్తం కేసులో వీడని సస్పెన్స్...!  బ్లడ్ బ్యాగ్స్ ఎటు వెళ్తున్నాయ్...?
Sheep Blood Racket
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2026 | 8:53 PM

Share

ఎంతకు తెగించార్రా…? సొమ్ము కోసం నరరూప రాక్షసుల్లా మారతారా…? మీ జేబులు నింపుకోవడానికి బ్రతికుండగానే మూగజీవాల రక్తం జుర్రేస్తారా…? పైసల కక్కుర్తితో సిరంజులు గుచ్చి చివరి బొట్టుదాకా పిండేస్తారా…? Tv9 నిఘాతో కీసర నాగారంలో వెలుగుచూసిన బ్లడ్ దందా తెలుగు రాష్ట్రాలను షేక్ చేయడమే కాదు… ఆ బ్లడ్‌ను దేనికి వాడుతున్నారన్న సస్పెన్స్‌ మతిపోగొడుతోంది. అధికారులకు సైతం ఈ నయా దందా సవాల్‌గా మారింది.

రాష్ట్రం దాటి ఢిల్లీదాకా వెళ్లిన ఈ దందాలో… రక్తాన్ని ఏం చేస్తున్నారని తెలుసుకునే ప్రాసెస్‌లో పూటకో అప్‌డేట్‌ షాక్‌కు గురిచేస్తోంది. కేవలం తెలంగాణలోనే కాదు… దేశవ్యాప్తంగా ఇక్కడ్నుంచే గొర్రె రక్తం ఎగుమతి జరుగుతోందన్న విషయం అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ దందాకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌ కాచిగూడలోని CNK కంపెనీని ఇప్పటికే సీజ్‌ చేసిన అధికారులు… ఒక్క ML గొర్రె రక్తాన్ని 18 రూపాయలకు అమ్ముతున్న తేల్చారు. అంతేకాదు… ప్రతి వారం ఒక్కో ఆర్డర్‌కు 50 లీటర్ల బ్లడ్‌ను CNK కంపెనీ ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

హ్యుమన్ బ్లడ్ స్టిక్కర్‌తో రాష్ట్రాలు దాటి వెళ్తున్న ఈ గొర్రె రక్తాన్ని 100 ML, 250 ML, 500 ML చొప్పున ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇంకో విషయమేంటంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ వస్తున్నాయని… ఆ ఆర్డర్స్‌ ఆధారంగానే రక్తాన్ని సేకరిస్తున్నట్లు తేలింది. ఇక ఇంతా జరుగుతోంది దేనికోసమనే తెలుసుకునే ప్రాసెస్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.

ఇంతటి దందా వెనుక ఉన్న కేటుగాడు ఎవరయ్యా అంటే… CNK ఇంపోర్ట్ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో ఆఫీస్‌ పెట్టి మూగజీవాల రక్తంతో బిజినెస్ చేస్తున్న చామకూర నికేష్‌కుమార్‌. ఇతగాడు దొరికితే తోలు వలిచైనా నిజాలు కక్కించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు అధికారులు. పరారీలో ఉన్న నికేష్‌ను పట్టుకుని ఈ రహస్య దందా మాటున అసలేం జరుగుతోందన్న నిజాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సో… ఎన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్‌ జరిపినా బ్లడ్ మిస్టరీ వీడట్లేదు…! ఆఫ్టర్‌ సేల్ ఏం జరుగుతుందో తెలియట్లేదు…! ఇక ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెరపడాలంటే నికేష్‌ దొరకాల్సిందే అన్నది అటు అధికారుల నుంచి కూడా వినిపిస్తున్న మాట.