AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

సినిమాల్లో తప్ప బయట పెద్దగా కనిపించరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో కనిపించినా ఆయన మాట్లాడేది చాలా తక్కువ. అభిమానుల మధ్యలోకి వచ్చారంటే అది ఇప్పటివరకు దాదాపు జరగలేదు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు
Prabhas Spirit
Nikhil
|

Updated on: Jan 08, 2026 | 10:30 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, రీసెంట్‌గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన వ్యక్తిగత అలవాట్లు, సినిమా విడుదల సమయంలో తన ఫీలింగ్స్ గురించి ఓపెన్ అయ్యారు. కోట్లాది మంది అభిమానులు ప్రభాస్ సినిమా వస్తుందంటే మొదటి రోజే థియేటర్ల వద్ద పండగ చేసుకుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం తన సినిమాలను మొదటి రోజు థియేటర్లో చూడరని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

వారం రోజుల తర్వాతే ..

సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమా పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి మొదటి రోజే థియేటర్లకు వెళ్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన కెరీర్‌లో ఏ ఒక్క సినిమాను కూడా ఫస్ట్ డే థియేటర్లో చూడలేదట. సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత, థియేటర్లలో రద్దీ తగ్గాక ప్రశాంతంగా సినిమా చూస్తానని ఆయన వెల్లడించారు. ఈ విషయం విన్న సందీప్ రెడ్డి వంగ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా విషయంలో సందీప్ రెడ్డి ప్రభాస్ కు ఒక గట్టి కండిషన్ పెట్టారు. “రాజా సాబ్ వరకు ఓకే కానీ, స్పిరిట్ సినిమాను మాత్రం మీరు ఖచ్చితంగా మొదటి రోజే థియేటర్లో చూడాలి” అని సందీప్ కోరారు. దానికి ప్రభాస్ నవ్వుతూ సమాధానం ఇస్తూ.. ఖచ్చితంగా ‘స్పిరిట్’ విషయంలో ఆ అలవాటును మార్చుకుంటానని, మొదటి రోజే సినిమా చూస్తానని ప్రామిస్ చేశారు.

2027 సంక్రాంతికి ‘స్పిరిట్’..

‘స్పిరిట్’ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్‌ను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, రేపు విడుదల కాబోతున్న ‘ది రాజా సాబ్’ రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తూనే, ‘స్పిరిట్’ కోసం ఇప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడో తెలుసా?
భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడో తెలుసా?
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం..
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం..
ఆగివున్న రైల్లో మంటలు..ముంబై విద్యావిహార్-కుర్లా మధ్య ఘటన..
ఆగివున్న రైల్లో మంటలు..ముంబై విద్యావిహార్-కుర్లా మధ్య ఘటన..
అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..