మన శంకరవరప్రసాద్ గారు ‘హుక్ స్టెప్’ కంపోజ్ చేసింది ఎవరో తెలుసా? ఇక ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ దశ తిరిగినట్టే
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘హుక్ స్టెప్’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో చిరంజీవి వేసిన స్టెప్పులు మెగాభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్ చిరంజీవిని చూస్తున్నామంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇది వరకే విడుదలైన కంటెంట్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మీసాల పిల్ల, శశిరేఖ, మెగా విక్టరీ మాస్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక బుధవారం (జనవరి 08) నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘హుక్ స్టెప్’ అనే సాంగ్ తో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి వేసిన స్టెప్పులు చూసి మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో చిరంజీవి సిగ్నేచర్ స్టైల్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ హుక్ స్టెప్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కాగా ఈ సాంగ్ ను కంపోజ్ చేసింది మరెవరో కాదు చిరంజీవి వీరాభిమాని, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆట సందీప్- జ్యోతి మాస్టర్స్. సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు డ్యాన్స్ లు చేసే ఈ దంపతులు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ పాటకే నృత్య రీతులు సమకూర్చారు. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం ఈ హుక్ స్టెప్ సాంగ్ కు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆట సందీప్ – జ్యోతిలను ప్రశంసిస్తూ స్వయంగా చిరంజీవి మెసేజ్ పంపారు. తన అభిమాన హీరో నుంచి అలాంటి సందేశం రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన సందీప్.. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అందులో ‘సార్.. ‘హుక్ స్టెప్’ ఇంటర్నెట్ ని కుమ్మేస్తోంది సార్!’ అని సందీప్ మెసేజ్ పెడితే.. దానికి చిరంజీవి రిప్లై ఇచ్చారు. ‘డియర్ సందీప్ అండ్ జ్యోతి, మీ అద్భుతమైన కృషికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఎక్కెడెక్కడో ఉన్న తెలుగు సినీ అభిమానులందరూ మీ ఆలోచన నుండి పుట్టిన, ఐకానిక్ ‘హుక్ స్టెప్’ను ప్రశంసిస్తూ, అభినందిస్తున్నారు. మీరు ఇన్నేళ్లుగా సంపాదించుకున్న ప్రేమ ఆప్యాయతలు ఈ క్షణంలో అందంగా పరిపూర్ణమయ్యాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీ ఇద్దరి కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన మైలురాళ్లు ఎదురుచూస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ. మీరు జెట్ స్పీడ్ తో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ.. మీ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. మంచి పేరు వస్తుంది’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు గానూ తాను, భార్య జ్యోతి ఎప్పటికీ రుణపడి ఉంటామని చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాడు సందీప్.
చిరంజీవి గురించి ఆట సందీప్ మాటల్లో..
ఇక పై నీ నృత్యం శంఖం లో పోసిన తీర్ధం రావాల్సిన అవకాశం వచ్చేసింది చెయ్యాల్సిన అద్భుతం చేసేసావు ఇక నీ ఆట కి తిరుగు లేదు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి #AataSandeep #MSVPG 🔥 pic.twitter.com/CD83mai5OC
— Sreedhar Adabala 👨💻 (@SreedharAdabala) January 8, 2026
కాగా ఆట సందీప్ గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




