Pawan Kalyan: పవన్ ‘బాలు’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఆ టాప్ హీరో భార్యగా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా నటించిన సినిమా బాలు. 2005 జనవరి 06న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో పవన్ సరసన శ్రియా శరణ్, నేహా ఓబెరాయ్ హీరోయిన్లు గా నటించారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బాలు ఒకటి. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రియ, నేహా ఓబెరాయ్ హీరోయిన్లు గా నటించారు. ‘తొలి ప్రేమ’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కరుణాకరన్- పవన్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఇది. 2005 జనవరి 6న విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పవన్ డ్రెస్సింగ్ స్టైల్ యూత్ కు పిచ్చెక్కించింది. సినిమాలో ఆయన నటించిన కార్గో ప్యాంట్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే 21 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలు సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాలు సినిమాలో భారీ తారగణమే ఉంది. హీరో, హీరోయిన్లతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా నటుడిగా వెలుగొందుతోన్న తేజ సజ్జా ఇందులో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. అలాగే బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ కూడా ఇందులో బాలనటిగా చేసింది. జయసుధ, గుల్షన్ గ్రోవర్, మహేష్ ఆనంద్, సౌరభ్ శుక్లా, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ల భరణి, ఎంఎస్ నారాయణ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.
ఇదిలా ఉంటే బాలు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రియా మొదటి ఛాయిస్ కాదట. అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న మహేష్ బాబు భార్య నమ్రతని కథానాయికగా అనుకున్నారట. సినిమా నిర్మాత అశ్వినీదత్ ఆమెతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. అయితే ఎందుకో గానీ ఉన్నట్లుండి నమత ఈ మూవీ నుంచి తప్పుకుందట. దీంతో నమ్రత ప్లేస్ లో శ్రియా వచ్చిందట. ఆ తర్వాత బాలు సినిమా షూటింగ్ పట్టాలెక్కిందట. మొత్తానికి అలా పవన్, నమ్రత కాంబినేషన్‌లో ఓ సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యింది.
నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
కాగా నమ్రతా శిరోద్కర్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు వంశీలోనూ కథానాయికగా మెరిసింది. ఈ సినిమా షూట్ లోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆతర్వాత పెద్దల అనుమతిలో పెళ్లిపీటలెక్కారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




